E-Paper
Advertisement

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ కు భారీ షాక్.. నష్టాలు తగ్గినా లాభాల్లోకి రాని ఓలా ఎలక్ట్రిక్!

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ కు భారీ షాక్.. నష్టాలు తగ్గినా లాభాల్లోకి రాని ఓలా ఎలక్ట్రిక్!
Advertisement

Ola Electric Q4 Results: ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఒకప్పుడు సత్తా చాటిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆర్థికంగా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసిక ఫలితాలను తాజాగా కంపెనీ ప్రకటించింది. భారీ నష్టాలు వచ్చినట్లు వెల్లడించింది. ఈ ప్రకటనతో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి.

Q4 రూ. 500 కోట్ల నష్టం

తాజా ఫలితాల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ మార్చి త్రైమాసికంలో సుమారు రూ.500 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కాస్త బెటర్ గా ఉంది. అప్పట్లో కంపెనీ నష్టం రూ.870 కోట్ల వరకు చేరింది. అంటే నష్టం తగ్గినా, కంపెనీ ఇంకా లాభాల్లోకి రాలేదనే విషయం స్పష్టమవుతోంది.

ఒక్కసారిగా పడిపోయిన ఓలా షేర్లు

Advertisement

Q4 ఫలితాల ప్రకటన తర్వాత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ షేర్లపై ఒత్తిడి పెరిగింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కంపెనీ షేర్లు 5 నుంచి 6 శాతం వరకు పడిపోయాయి. ఇన్వెస్టర్లు కంపెనీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం విషయానికి వస్తే, కంపెనీ పరిస్థితి మరింత బలహీనంగా కనిపిస్తోంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈసారి భారీ తగ్గుదల నమోదైంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 57 శాతం తగ్గి రూ.265 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ.611 కోట్లుగా ఉంది.

నష్టాలకు కీలక కారణాలు ఏంటి?

ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ తగ్గడమేనని తెలుస్తోంది. మార్కెట్లో ఇప్పుడు పోటీ కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీ, ఏథర ఎనర్జీ లాంటి కంపెనీలు కొత్త మోడళ్లతో బలమైన పోటీ ఇస్తున్నాయి. దీనివల్ల ఓలా అమ్మకాలపై ప్రభావం పడింది.  ఈ త్రైమాసికంలో ఓలా మొత్తం 20,256 ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే డెలివరీ చేసింది. గతంతో పోలిస్తే ఇది తక్కువ సంఖ్యగానే భావిస్తున్నారు. డెలివరీలు తగ్గడంతో కంపెనీ ఆదాయం కూడా పడిపోయింది.

Advertisement

అయితే, పూర్తిగా ప్రతికూల పరిస్థితి అని మాత్రం చెప్పలేం. కంపెనీ కొన్ని ఖర్చులను తగ్గించడంలో విజయవంతమైంది. నిర్వహణ వ్యయాలను తగ్గించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి చర్యల వల్ల నష్టాలను కొంతవరకు నియంత్రించగలిగింది. కంపెనీ మొదటిసారి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్‌ గా నమోదైందని ప్రకటించింది. ఇప్పటికైతే ఓలా ఎలక్ట్రిక్‌కు మార్కెట్లో గట్టి పోటీ, తగ్గుతున్న డిమాండ్ పెద్ద సవాళ్లుగా మారాయి. రాబోయే నెలల్లో కొత్త ప్రొడక్ట్స్, మెరుగైన సేవలు, ధరల వ్యూహం ద్వారా కంపెనీ తిరిగి బలోపేతం అవుతుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: వావ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఇంత లాభమా? నిజంగా వండర్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×