SRH VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) మధ్య 67వ మ్యాచ్ ఇవాళ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. ఇవాళ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా…. వర్షం విలన్ గా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చల్లటి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో కూడా వర్షం ( Hyderabad Rain) పడే ప్రమాదం ఉందని అంటున్నారు. సాయంత్రం వరకు హైదరాబాద్ మహా నగరంలో ఆకాశం మేఘావృతమై… చిరు జల్లులు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. టాస్ పడే సమయానికి 60 నుంచి 70% వర్షం ఉండే ఛాన్సులు ఉన్నట్లే చెబుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే వర్షం పడితే టాస్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా, మ్యాచ్ మాత్రం కచ్చితంగా నిర్వహిస్తారని అంటున్నారు.
ఒకవేళ మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఉంటే… రద్దయ్యే ఛాన్సులు ఉంటాయి. అదే జరిగితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నష్టమే జరుగుతుంది. ప్రస్తుతం 16 పాయింట్లు దక్కించుకున్న హైదరాబాద్.. మ్యాచ్ రద్దు అయితే 17 పాయింట్లకు చేరుకుంటుంది. అలా జరిగితే ఎప్పటిలాగే మూడో స్థానంలోనే సన్రైజర్స్ ఉంటుంది. అటు బెంగళూరు 19 పాయింట్ల మొదటి స్థానంలోనే కొనసాగుతుంది. అలా కాకుండా మ్యాచ్ సక్రమంగా జరిగి.. బెంగళూరు పైన భారీ స్కోర్ తేడాతో హైదరాబాద్ గెలిస్తే, మనోళ్లకు అడ్వాంటేజ్ ఉంటుంది.
రన్ రేట్ ప్రకారం, రెండో స్థానం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు గుజరాత్ ( GT) మూడో స్థానానికి పడిపోతుంది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లకు క్వాలిఫైయర్ లో ఓటమి ఎదురైనా.. ఎలిమినేషన్ మ్యాచ్ అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో స్థానంలో ఉండేందుకు హైదరాబాద్ ( SRH) ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇంతలోనే వర్షం విలన్ గా మారడం నిజంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు నిరాశ అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా, ప్లే ఆఫ్స్ కు ఇప్పటికే ఆర్సీబీ, సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం నాలుగు జట్టు పోటీ పడుతున్నాయి.