E-Paper
Advertisement

Ambati Rayudu: CSK జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..గిల్ కు అంబ‌టి వార్నింగ్ !

Ambati Rayudu: CSK జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..గిల్ కు అంబ‌టి వార్నింగ్ !
Advertisement

Ambati Rayudu:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Gujarat Titans vs Chennai Super Kings) మధ్య కీలక పోరు జరిగింది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. గుజరాత్ ఫాస్ట్ బౌలింగ్ దళానికి.. తలొగ్గారు. ఈ క్రమంలో ఏకంగా 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కించపరుస్తూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ (Shubman Gill ) అసభ్యకరమైన సైగలు చేశాడు. చెన్నై అభిమానులు విజిల్స్ వేయకుండా, గప్ చుప్ గా కూర్చోవాలంటూ మూతిపై వేలు వేసి వార్నింగ్ ఇచ్చాడు. శివమ్ దూబే ( Shivam Dube) క్యాచ్ అందుకున్న తర్వాత గిల్ ఇలా ప్రవర్తించాడు. అంతేకాదు, డ్రెస్సింగ్ రూంలో కూడా గిల్, సిరాజ్‌, బ‌ట్ల‌ర్ కూడా మూతిన వేలు వేసి, చెన్నై సూప‌ర్ కింగ్స్ ను ట్రోల్ చేశారు. ఈ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

CSK జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..గిల్ కు అంబ‌టి వార్నింగ్ !

Advertisement

చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టును ట్రోల్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాళ్ల‌పై మాజీ CSK ఆట‌గాడు అంబ‌టి రాయుడు సీరియ‌స్ అయ్యాడు. CSK జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తానంటూ గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్ కు వార్నింగ్ ఇచ్చారు మాజీ చెన్నై ఆట‌గాడు అంబ‌టి రాయుడు (Ambati Rayudu). క్రికెట్ మ్యాచ్ అన్నాక గెలుపు ఓటములు సహజమని పేర్కొన్న అంబటి రాయుడు… ఓటమి చెందిన జట్టును రోల్ చేయడం అన్యాయమన్నారు. గతంలో మ్యాచ్ గెలిచిన తర్వాత విజిల్ నోట్లో పెట్టుకొని గిల్ ఓవరాక్షన్ చేశాడని మండిపడ్డారు. ఇక నిన్న అహ్మదాబాద్ వేదికగా కూడా గిల్ ప్రవర్తన ఏ మాత్రం బాగాలేదని ఫైర్ అయ్యారు. భారత జట్టు కెప్టెన్ గా ఉన్న గిల్… ఇలా చిల్లరగా ప్రవర్తిస్తే, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు మరింత రెచ్చిపోవడం గ్యారంటీ అని ఫైర్ అయ్యారు. గిల్ కాస్త క్లాస్ గా వ్యవహరిస్తే బాగుంటుందని సూచనలు చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా టైం వస్తుందని… అప్పుడు గుజరాత్ పని చెబుతామ‌ని హెచ్చరించారు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరును విమర్శించారు అంబటి రాయుడు. ఇది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఘోర ఓటమి అని మండిపడ్డారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదని ఆగ్రహించారు. ప్లేయింగ్ 11 లో కీలక ప్లేయర్లను ఉంచకుండా… చెత్త ప్లేయర్లను తీసుకున్నారని మండిపడ్డారు. అకెలా హుస్సేన్ లాంటి ప్లేయర్ ను ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. చెన్నై సూపర్ కింగ్స్ డేంజర్ ఆటగాడు సంజు శాంసన్ గాయపడడం పెద్ద మైనస్ గా మారిందన్నారు. ఇక వచ్చే ఏడాది అయినా చెన్నై సూపర్ కింగ్స్… మెరుగ్గా ఆడాలని కోరారు.

Advertisement

 

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

instagram.com/p/DYnvKm7AJXL/?igsh=MXRwdnI0NGJydW1jaQ==

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×