E-Paper
Advertisement

ఓలా సోనా వీకెండ్.. స్కూటీలపై రూ.50 వేల వరకు ఆఫర్!

ఓలా సోనా వీకెండ్.. స్కూటీలపై రూ.50 వేల వరకు ఆఫర్!
Advertisement

Ola Sona Weekend: అక్షయ తృతీయ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా భారీ ఆఫర్లతో ‘ఓలా సోనా వీకెండ్’ ను ప్రకటించింది. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఏప్రిల్ 18, 19 తేదీలలో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో రూ. 50,000 వరకు ప్రయోజనాలు కల్పిస్తుంది. ఈ ఆఫర్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై ప్రత్యేక ధరలు, క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్, వారెంటీలు పొడిగింపు, 24 క్యారెట్ బంగారు పూత పూసిన పార్ట్స్ తో లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.

ఓలా సోనా వీకెండ్

అక్షయ తృతీయ సందర్భంగా ఓలా సోనా వీకెండ్ ఆఫర్లు ప్రకటించిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రూ. 50,000 వరకు విలువైన ప్రయోజనాలు, లిమిటెడ్-ఎడిషన్ ఓలా సోనా వెహికల్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రకటనలో ఓలా ఈవీలకు డిమాండ్ పెరిగిందని అన్నారు. ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై కస్టమర్లు ఆర్డర్స్ చేస్తున్నారన్నారు.

ప్రత్యేకమైన ఆఫర్లు

Advertisement

రెండు రోజుల పాటు కస్టమర్లకు రూ. 50,000 వరకు ఆఫర్లు అందిస్తున్నారు. ఓలా జెన్ 3 ఎస్1 ఎక్స్ (2kWh), రోడ్‌స్టర్ ఎక్స్ (2.5 kWh) మోడళ్లను రూ. 49,999 ప్రారంభ ధరకే అందిస్తోంది.

రోడ్‌స్టర్ X+ ధర తగ్గింపు

ఓలా 4680 భారత్ సెల్ పవర్డ్ రోడ్‌స్టర్ X+ వెహికల్ ధరను రూ.50 వేలు తగ్గించింది. దీని మునుపటి ధర రూ. 1,89,999 కాగా ప్రస్తుతం రూ. 1,39,999కి అందిస్తుంది. ఈ ఆఫర్ ప్రమోషనల్ తేదీలలో సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 గంటల మధ్య పరిమిత యూనిట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు 8 సంవత్సరాల ఉచిత వారంటీ పొందవచ్చు.

Advertisement

Also Read: తారాజువ్వలా ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. సోమవారం మార్కెట్‌లో పరిస్థితి, మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి?

లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ స్కూటర్

లిమిటెడ్ ఎడిషన్ ఓలా S1 ప్రో సోనా(గోల్డ్) స్కూటర్‌ను 24 క్యారెట్ల బంగారు పూత పూసిన పార్ట్స్ తో డిజైన్ చేశారు. ఈ ప్రత్యేకమైన స్కూటర్ ‘సోనా మూడ్’ అనే కలిగి ఉంది. ఓలా యాప్‌లోని గోల్డ్ థీమ్ ఇంటర్‌ఫేస్, MoveOS డాష్‌బోర్డ్ ద్వారా ప్రీమియం రైడింగ్ ను అందిస్తుంది. ఈ డాష్‌బోర్డ్ రైడర్‌లకు రైడ్ మోడ్‌లు, సెట్టింగ్‌లను మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది.

తగ్గింపులు

ఓలా ఎలక్ట్రిక్ తన పోర్ట్‌ఫోలియోలో రూ.40,000 వరకు డిస్కౌంట్‌ సహా అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ, హెచ్ఎస్బీసీ, హెచ్డీఎఫ్సీ, స్కాపియా ఫెడరల్ వంటి బ్యాంకింగ్ పార్ట్ నర్స్ ద్వారా EMIలపై రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ ఆఫర్ కాలంలో కొనుగోలు చేస్తే 8 సంవత్సరాల వారంటీ పొందవచ్చు.

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×