E-Paper
Advertisement

ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల

ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల
Advertisement

MJPTBC Degree Admissions: స్వేచ్ఛ బ్యూరో: ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరానికి ఎంజేపీటీబీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎం జె పి కార్యదర్శి బడుగు సైదులు సూచించారు .ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఎంజoపీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఆయన అభినందించారు. ఎంజేపీ లో ఇంటర్ చదివిన విద్యార్థులు తమ సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

డిగ్రీ కోర్సులో ప్రవేశం

ఎంజేపీలో కాకుండా ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎంజేపీటీబీసీడ్ల్యూ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలలో (ఇంగ్లీష్ మీడియం) మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-Degree/ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకుని వారు కోరుకున్న కోర్సులో సీటు కేటాయించడం జరుగుతుందని ఆయన వివరించారు.

Advertisement

Also Read: రంగారెడ్డి జిల్లాలో రగులుతున్న పదవుల వేట.. ఇక అందరి చూపు అటువైపే..?

ఆధునిక కోర్సులు..

రాష్ట్రవ్యాప్తంగా ఎంజేపీలో 30 డిగ్రీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, రెగ్యులర్ కోర్సులు బీఎస్సీ, బీకామ్, బీఏలతో పాటు బీఎస్సీ, బీబీఏ, బీఎఫ్​ టీ, అనిమేషన్, వి ఎఫ్​ ఎక్స్ మొదలైనవి ఆధునిక కోర్సులు అందిస్తున్నామని సైదులు తెలిపారు. గతంలో డిగ్రీ పూర్తి చేసిన ఎందరో విద్యార్థులకు ప్లేస్ మెంట్ లు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.ఎంజేపీ విద్యాసంస్థల్లో చేరిన ప్రతి విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా రాణించేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు అత్యున్నత విద్య అభ్యసించేలా శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించారు.

ఈ ఏడాది..

Advertisement

క్రీడల్లోనూ ఎం జె పి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలు కాలేజీ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనుకుంటే గురుకుల విద్యాసంస్థల్లో చేర్చాలని, చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకుంటారని ఆయన అన్నారు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం ఫోన్ నెం. 040-23328266 లో సంప్రదించాలని కార్యదర్శి సూచించారు.

Also Read: బచ్చన్నపేటలో బెల్ట్ షాపుల జాతర.. వైన్స్‌లో లేని స్టాక్ అక్కడ ఫుల్..?

Related News

హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్-కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు, హైదరాబాద్‌లో కూడా

తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

Big Stories

Advertisement
×