E-Paper
Advertisement

బుల్లితెరపై తీరని విషాదం.. క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన మరో యంగ్ స్టార్.. !

బుల్లితెరపై తీరని విషాదం.. క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన మరో యంగ్ స్టార్.. !
Advertisement

Siddharth Venugopal:మలయాళ టెలివిజన్ రంగంలో మరో యంగ్ హీరో కన్నుమూశారు.కేవలం 41 ఏళ్ల వయసులోనే మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్‌ కన్నుమూయడం ఇప్పుడు ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఒక పక్క గ్లామర్ ప్రపంచంలో అందరినీ అలరిస్తూనే, మరోపక్క ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక యువ నటుడి ప్రయాణం ఇంత విషాదకరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు.

 సీనియర్ నటి పెట్టిన పోస్ట్ వైరల్

Advertisement

గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో నరకయాతన అనుభవిస్తున్న ఆయన ఈరోజు (శనివారం) తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ముఖం వెనుక ఇంతటి బాధ ఉందా అని అందరూ షాక్ అవుతున్నారు. ఆయన మరణవార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక సిద్ధార్థ్ వేణుగోపాల్‌ మరణవార్తను సీనియర్ నటి సీమా జి. నాయర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కన్ఫర్మ్ చేశారు. ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.’సిద్ధూ..నిన్ను కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నం లేదు, తిరగని హాస్పిటల్ లేదు..కానీ చివరికి విధి నిన్ను మా నుంచి లాగేసుకుంది” అంటూ ఆమె రాసిన మాటలు చూస్తే పరిస్థితి ఎంత బాధాకరంగా ఉందో అర్థమవుతోంది.

సూపర్ హిట్ సీరియల్స్‌తో స్టార్‌డమ్

Advertisement

సిద్ధార్థ్ వేణుగోపాల్‌ కెరీర్ విషయానికి వస్తే త్రిస్సూర్ జిల్లాలోని చాలకుడి కు చెందిన సిద్ధార్థ్ చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. మొదట బ్రాడ్‌కాస్టర్‌గా, రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు.అక్కడ కస్తూరిమాన్’, ‘భాగ్యజాతకం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో  ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కెరీర్ బాగుంది అనుకుంటున్న సమయంలోనే క్యాన్సర్ సిద్ధార్థ్ వేణుగోపాల్‌ పై ఎటాక్ చేయడం బాధాకరం.

ట్రీట్‌మెంట్ కోసం భారీ ఖర్చు

గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ట్రీట్‌మెంట్ కోసం లక్షలు ఖర్చు చేసినా, కీమోథెరపీ వల్ల శరీరం బలహీనపడినా కూడా కెమెరా ముందుకు రావాలన్న ఆయన తపనకి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే .ముఖ్యంగా సహనటుడు కిషోర్ సత్య సహా పలువురు నటులు సిద్ధార్థ్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. బుల్లితెరపై ఎంతో ఫ్యూచర్ ఉన్న ఒక నటుడు ఇలా ఉన్న పళంగా  వెళ్లిపోవడం మలయాళ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెబుతున్నారు.సిద్ధార్థ్ వేణుగోపాల్కు తల్లి, తమ్ముడు ఉన్నట్టు  తెలుస్తుంది.ఇక  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, టెలివిజన్ వర్గాలు సంతాపం ప్రకటిస్తున్నాయి.ఏది ఏమైనా… ఎంతటి సెలబ్రిటీ అయినా జీవితం ముందు, విధి ముందు తలవంచాల్సిందే అని సిద్ధార్థ్ మరణం మరోసారి గుర్తు చేసింది.

also read:‘వరల్డ్ వార్ z’ సీక్వెల్ వచ్చేస్తుంది.. 13 ఏళ్ల తర్వాత నిర్మాతలు కీలక నిర్ణయం, బ్రాడ్ పిట్ ఉంటాడా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×