E-Paper
Advertisement

పెట్రోల్ కారా? హైబ్రిడ్ కారా? ఏది కొంటే డబ్బు మరింత సేవ్ చేసుకోవచ్చు?

పెట్రోల్ కారా? హైబ్రిడ్ కారా? ఏది కొంటే డబ్బు మరింత సేవ్ చేసుకోవచ్చు?
Advertisement

Petrol vs Strong Hybrid Cars: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, పెట్రోల్ కారు కొనాలా? స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు కొనాలా? అనే డౌట్ వస్తుంది. పెట్రోల్ కార్లతో పోలిస్తే హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. అయితే, వాటి కొనుగోలు ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి ఏ కారు కొనడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పెట్రోల్ కారు ధర తక్కువ.. మెయింటెనెన్స్? 

పెట్రోల్ కార్లకు భారత మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. వీటి ధరలు సాధారణంగా అదే మోడల్‌కు చెందిన స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల కంటే తక్కువగా ఉంటాయి. కొనుగోలు సమయంలో బడ్జెట్‌ ను తగ్గించుకోవాలనుకునే వారికి పెట్రోల్ కారు బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా పెట్రోల్ కార్లకు సర్వీసింగ్ సదుపాయాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు కారు మోడల్, ఇంజిన్ సామర్థ్యం, డ్రైవింగ్ విధానం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.

స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు ప్రత్యేకత ఏంటి?

Advertisement

స్ట్రాంగ్ హైబ్రిడ్ కారులో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ఉంటాయి. తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో, ట్రాఫిక్‌ లో కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో కారు నడుస్తుంది. అవసరమైనప్పుడు పెట్రోల్ ఇంజిన్ కూడా పనిచేస్తుంది. ఈ విధానం వల్ల ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఇంధన వినియోగం తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజ్ అందిస్తాయి. అయితే, వాటి ప్రారంభ ధర ఎక్కువగా ఉండటం, మోడల్‌ ను బట్టి రిపేర్ ఖర్చులు మారుతాయి.

నెలకు ఎంత ప్రయాణిస్తారనేది ముఖ్యం

ఒక పెట్రోల్ కారు లీటర్‌కు 15 కిలోమీటర్లు, ఒక హైబ్రిడ్ కారు లీటర్‌కు 25 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని భావిస్తే,  నెలకు 1,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే, పెట్రోల్ కారుకు సుమారు 67 లీటర్లు అవసరం అవుతాయి. హైబ్రిడ్ కారుకు దాదాపు 40 లీటర్లు సరిపోవచ్చు. అంటే నెలకు సుమారు 27 లీటర్ల పెట్రోల్ ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. నెలకు 2,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ తేడా మరింత పెరుగుతుంది. అయితే, నిజమైన మైలేజ్, పెట్రోల్ ధరలను బట్టి ఆదా అయ్యే మొత్తం మారుతుంది.

ఏ కారు కొంటే మంచిదంటే?   

Advertisement

మీరు తక్కువ దూరాలు ప్రయాణిస్తుంటే, బడ్జెట్ ముఖ్యమైతే పెట్రోల్ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. రోజూ ఎక్కువ దూరం సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణిస్తుంటే హైబ్రిడ్ కారు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. హైవేపై ప్రయాణించే సమయంలో కూడా హైబ్రిడ్ కారు ఇంధనాన్ని ఆదా చేస్తుంది. కానీ, మోడల్, వేగం, డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కారు కొనుగోలు ధర మాత్రమే కాకుండా ఐదేళ్ల ఫ్యూయల్ ఖర్చు, సర్వీసింగ్ ఖర్చు, ప్రయాణ దూరం అన్నింటినీ కలిపి లెక్కించాలి. అప్పుడు పెట్రోల్ కారు మంచిదా? హైబ్రిడ్ కారు మంచిదా? అనేది తెలుస్తోంది.

Read Also: ఇండియాలో టెస్లా రోడ్‌స్టర్ బుకింగ్స్.. వామ్మో.. రిజర్వేషన్ కోసం రూ.2.50 కోట్లా?

Tags

Related News

పండుగ సీజన్ తర్వాత కార్ల ధరలు పెరుగుతాయా? కొనుగోలుదారులకు కీలక అలర్ట్..

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన బైక్‌లు ఇవే.. నంబర్ వన్ ఏదంటే?

టీవీఎస్ To బజాజ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్‌ ఎవరంటే?

ఇండియాలో టెస్లా రోడ్‌స్టర్ బుకింగ్స్.. వామ్మో.. రిజర్వేషన్ కోసం రూ.2.50 కోట్లా?

మారుతి జిమ్నీ To మహీంద్రా థార్.. రూ.20 లక్షల లోపు పవర్‌ఫుల్ 4×4 SUVలు ఇవే!

రెడ్ అండ్ బ్లాక్ లుక్‌లో హ్యుందాయ్ బేయాన్.. ఫీచర్లు అదుర్స్!

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

Big Stories

Advertisement
×