Tesla Roadster India Reservations Open: ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న టెస్లా రోడ్ స్టర్ ఇండియన్ కార్ల ప్రియుల ఆకట్టుకుంటుంది. ఈ స్పోర్ట్స్ కారు కోసం టెస్లా ఇండియా వెబ్ సైట్ లో రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రాకెట్ తరహా థ్రస్టర్లతో గాలిలో విన్యాసాలు చేసే ఈ కారు అందరినీ ఆకట్టుకుంటుంది. బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ, దేశంలో దీని డెలివరీ డేట్, ఫైనల్ రేట్ ఇంకా ఖరారు కాలేదు.
టెస్లా రోడ్ స్టర్ కోసం రెండు రిజర్వేషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ వేరియంట్‌కు మొదట రూ.5.01 లక్షలు చెల్లించాలి. ఆ తర్వాత 10 రోజుల్లో మరో రూ.45.05 లక్షలు చెల్లిస్తే మొత్తం రిజర్వేషన్ మొత్తం రూ.50.06 లక్షలకు చేరుతుంది. ఇక థ్రస్ట్ వేరియంట్‌ను ఎంచుకునేవారు మొదట రూ.5.01 లక్షలు చెల్లించి, తర్వాత రూ.2.45 కోట్లకు పైగా అదనంగా చెల్లించాలి. దీంతో మొత్తం రిజర్వేషన్ చెల్లింపు రూ.2,50,25,000 అవుతుంది. అయితే, ఇవి కారు పూర్తి ధరలు కావు. ప్రారంభంగా చెల్లించే రూ.5.01 లక్షలు వాపసు పొందవచ్చని టెస్లా వెల్లడించింది.
టెస్లా రోడ్‌స్టర్‌ను పెర్ఫార్మెన్స్, థ్రస్ట్, రాకెట్ అనే మూడు కాన్ఫిగరేషన్లలో రూపొందించినట్లు కంపెనీ వివరించింది. పెర్ఫార్మెన్స్ వెర్షన్‌లో ఏరోడైనమిక్ టెక్నాలజీ, అదనపు గ్రిప్ కోసం సక్షన్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. థ్రస్ట్ వేరియంట్‌లో అదనపు వేగాన్ని అందించేందుకు థ్రస్టర్లు ఉంటాయి. ఇక రాకెట్ వెర్షన్‌లో 10 థ్రస్టర్లతో కూడిన ప్రత్యేక ఫ్లైట్ సిస్టమ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
రోడ్‌స్టర్ గురించి అత్యంత ఆసక్తికరమైన అంశం థ్రస్టర్ టెక్నాలజీ. ప్రదర్శనలో ఈ కారు గాలిలో విన్యాసాలు చేస్తున్నట్లు చూపించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 0.81 సెకన్లలో అందుకుంటుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. అయితే, ఈ పనితీరు సామర్థ్యం వాస్తవ పనితీరు, గాల్లో విన్యాసాల సామర్థ్యంపై స్పష్టత రావాల్సి ఉంది.
రోడ్‌స్టర్ ఉత్పత్తి 2028లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. తొలుత లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వాహనాల ఉత్పత్తిపైనే దృష్టి పెట్టనున్నారు. భారత్‌లో అవసరమైన రైట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. తుది భారతీయ ధర కూడా ప్రకటించలేదు. టెస్లా మోడల్ Y Lకు ఉచిత యాక్సిలరేషన్ బూస్ట్ అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. ఈ అప్‌గ్రేడ్‌తో 0–100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో అందుకుంటుందని, WLTP ప్రకారం 681 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రోడ్‌స్టర్ రిజర్వేషన్లు ప్రారంభమైనా.. తుది ధర, భారతీయ రోడ్లపైకి వచ్చే తేదీ, థ్రస్టర్ సిస్టమ్‌కు అనుమతులపై స్పష్టత వచ్చేవరకు కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండటం మంచిది.
Read Also: మారుతి జిమ్నీ To మహీంద్రా థార్.. రూ.20 లక్షల లోపు పవర్‌ఫుల్ 4×4 SUVలు ఇవే!