E-Paper
Advertisement

ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ లాక్!

ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Aadarsha kutumbam AK 47: త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం: ఏకే 47 ‘. ఈ సినిమా మేకర్స్ ప్రతిసారి పోస్టర్ విడుదల చేయడం.. ఇట్స్ అఫీషియల్ అంటూ ప్రకటించడం.. ఆ తర్వాత సినిమా విడుదల తేదీని వాయిదా వేయడం.. చూస్తుంటే అసలు ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే అనుమానాలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ లో వస్తూనే ఉన్నాయి. నిజానికి అప్పుడు ఎప్పుడో అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కానీ అనుకున్న తేదీకి విడుదల చేయలేదు. కారణం దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ఈ సినిమాను వాయిదా వేశారనే కామెంట్లు అప్పట్లో వినిపించాయి.

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..

దీంతో అక్టోబర్ 9కి సినిమాను వాయిదా వేశారు. అయితే ఆ సినిమా సమయంలో ఇతర హీరోల సినిమాలు విడుదలలు ఉండడం, దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు అంటూ సినిమా మళ్లీ వాయిదా పడింది. అలా విడుదల తేదీ ప్రకటించడం, ఆ తర్వాత వాయిదా వేయడం, వాయిదా వేయడానికి గల కారణాలను నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరి వివరించడంతో పాటు అభిమానులు చిత్ర బృందంపై ఇటు త్రివిక్రమ్, నాగవంశీల పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మళ్లీ ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది అంటూ వార్తలు రాగా మధ్యలో నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

అక్టోబర్ 30న విడుదల..

Advertisement

అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ఈమధ్య కాలంలో ప్రకటించలేదు. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఆశగా ఎదురు చూడగా.. ఇప్పుడు తాజాగా చిత్ర బృందం దసరా పండుగ సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేస్తూ ఇట్స్ అఫీషియల్ అంటూ అక్టోబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నామంటూ ప్రకటించింది. దీంతో వెంకటేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ALSO READ: నీతూ వర్సెస్ వర్షిణి.. అసలైన దమ్ము ఎవరికుంది?

ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు?

Advertisement

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందించారు. ఇందులో వెంకటేష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. నివేదా పేతురాజు కీలకపాత్ర పోషిస్తుండగా.. నారా రోహిత్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కుటుంబ కథలకు ప్రాధాన్యత ఇచ్చే వెంకటేష్ ఒకవైపు.. తనదైన సంభాషణలు, కథనంతో గుర్తింపు పొందిన త్రివిక్రమ్ మరోవైపు ఈ చిత్రంలో భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఆదర్శ కుటుంబం అందుకుంటుందో లేదో చూడాలి. కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అసలు ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related News

వారణాసి కథ లీక్ చేసిన రాజమౌళి.. సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదంటూ!

ఖరీదైన టెస్లా కారు కొన్న సింగర్ రాహుల్.. ధర ఎంతంటే?

ఘనంగా భూమి పూజతో మొదలైన వరుణ్ తేజ్ ‘ బరి’!

ఆస్కార్ వేదికపై రామాయణ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

ఇండస్ట్రీలో విషాదం.. దేవా సోదరుడి కొడుకు మృతి!

ఆగిపోయిన ‘ప్రేమలు 2’.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్!

వెన్నులో వణుకుపుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ 418 మూవీ ట్రైలర్!

Big Stories

Advertisement
×