E-Paper
Advertisement

Petrol vs Diesel Car: పెట్రోల్ vs డీజిల్ కార్లలో ఏది బెస్ట్? ఎందుకు?

Petrol vs Diesel Car:  పెట్రోల్ vs డీజిల్ కార్లలో ఏది బెస్ట్? ఎందుకు?
Advertisement

Petrol vs Diesel Car: మార్కెట్ లో చాలా వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. కొంత మంది పెట్రోల్ కారు కొంటే, మరికొంత మంది డీజిల్ కారు కొనుగోలు చేస్తారు. ఇంకొంత మంది హైబ్రిడ్ కారు, అదీ కాదంతే ఎలక్ట్రిక్ కారు తీసుకుంటారు. అయితే, ఇప్పుడు మనం డీజిల్, పెట్రోల్ కార్లలో ఏది బెస్ట్? అనేది తెలుసుకుందాం..

ధరల వివరాలు..

నిజానికి కారు కొనుగోలు చేసే యజమాని ప్రస్తుత అవసరాలు, ప్రయాణ శైలి, భవిష్యత్ ఆలోచనలకు అనుగుణంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కార్ల మధ్య ఉండే తేడాలు, అనుకూలతలు, ప్రతికూలతల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎవరికి ఏది సరిపోతుందో చెక్ చేసుకుని కొనుగోలు చేయాలి. వాస్తవానికి పెట్రోల్ కార్లు డీజిల్ కార్లతో పోల్చితే తక్కువ ధరను కలిగి ఉంటాయి. బడ్జెట్ ధరలో కారు కావాలి అనుకునే వాళ్లు  పెట్రోల్ కార్లు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ఇంజిన్లు కూడా చాలా సింపుల్ గా ఉండటం వల్ల మెయింటెనెన్స్ బాగుంటుంది. వీటి స్పేర్ పార్ట్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. సర్వీసింగ్ ఖర్చులు తక్కువగా డీజిల్ తో పోల్చితే ఉంటాయి. డీజిల్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి డీజిల్ కార్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

ఏ కారు మైలేజ్ ఎక్కువ?

Advertisement

మైలేజ్ పరంగా చూస్తే, డీజిల్ కార్లు పెట్రోల్ కార్లతో పోలిస్తే తక్కువ ఇంధనంతో ఎక్కువ కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తాయి. డీజిల్ కార్లు లాంగ్ డ్రైవ్‌లు, హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. డీజిల్ ధరలు కూడా పెట్రోల్ కంటే తక్కువగా ఉండటం వల్ల లాంగ్ రన్ లో డబ్బుల ఆదా అవుతాయి. పెట్రోల్ కార్లు సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.

రీసేల్  వ్యాల్యూ గురించి..  

డీజిల్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. మంచి రీసేల్ విలువ కలిగి ఉంటాయి. పెట్రోల్ కార్లు తక్కువ శబ్దం, తక్కువ వైబ్రేషన్ వల్ల డ్రైవింగ్ చేయడం చాల స్మూత్ గా ఉంటుంది. డీజిల్ కార్లు ఎక్కువ టార్క్ ఇచ్చినా, శబ్దం, వైబ్రేషన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ కార్లు తక్కువ కొనుగోలు ఖర్చుతో, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. డీజిల్ కార్లు ఎక్కువ మైలేజ్, ఎక్కువ టార్క్‌ తో లాంగ్ డ్రైవ్‌లకు అనుకూలంగా ఉంటాయి.

Advertisement

Read Also: కళ్లు చెదిరేలా టయోటా హైలాండర్ EV 2027, ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా భయ్యా!

పర్యావరణానికి ఏది బెస్ట్?

పర్యావరణ పరంగా చూస్తే పెట్రోల్ కార్లు తక్కువ పొల్యూషన్ విడుదల చేస్తాయి. వీటిలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి గ్యాస్‌లు తక్కువగా ఉంటాయి. పెట్రోల్ కార్లు పర్యావరణ పరంగా కొంచెం బెస్ట్ అని చెప్పవచ్చు.డీజిల్ కార్లు ఎక్కువ టార్క్, పవర్ ఇస్తున్నప్పటికీ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. హానికర గ్యాస్‌లు ఎక్కువగా విడుదలవుతాయి.

Read Also: ఒకే ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణం, అదిరిపోయే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×