E-Paper
Advertisement

Mahindra eAuto: ఒకే ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణం, అదిరిపోయే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది!

Mahindra eAuto: ఒకే ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణం, అదిరిపోయే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది!
Advertisement

ప్రముఖ ఆటో మోబైల్ దిగ్గజం మహీంద్రా.. సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను విడుదల చేసింది.  ఒకే ఛార్జ్ తో ఏకంగా 200 కిలోఎ మీటర్ల దూరం ప్రయాణించేలా దీనిని తయారు చేసింది. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ UDO అనే పేరుతో ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 3,58,999గా కంపెనీ ప్రకటించింది. భారత్ లో నంబర్ వన్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహన తయారీదారుగా తనను తాను నిలబెట్టుకున్న కంపెనీ, ఈ ఆటో రిక్షాను మరింత క్రేజీగా తయారు చేసింది. దీనికి UDO అనే పేరు కూడా లాజికల్ గా పెట్టింది. ‘ఎగరడం’ అనే అర్థం వచ్చే హిందీ పదం నుంచి ఈ పేరు పెట్టింది.

UDO బ్యాటరీ.. రేంజ్.. గరిష్ట వేగం..  

మహీంద్రా UDO ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మోనోకోక్ నిర్మాణాన్ని కలిగి ఉంది. IP67-రేటెడ్ 11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ తో నడుస్తుంది. ఇది ఒకే ఛార్జ్ తో 200 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ ను అందిస్తుంది. ఈ వాహనం మోటార్ 10 kW పీక్ పవర్, 52 Nm టార్క్‌ ను అందిస్తుంది. దీని రేస్ మోడ్‌ లో గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఉంటుంది.

UDO డిజైన్ గురించి..

Advertisement

UDO డిజైన్ ను పరిశీలిస్తే, డ్రైవర్ల కోసం పైలట్ సీటును ఏర్పాటు చేసింది. ఇది పోటీ వాహనాలతో పోల్చితే దాదాపు 20 శాతం మందంగా ఉంటుంది. అదనపు లెగ్‌ రూమ్, హెడ్‌ రూమ్‌ తో మెరుగైన ప్రయాణీకుల సీటింగ్ సౌకర్యం ఉంది. ఈ వాహనం ఇండిపెండెంట్ బ్యాక్ సస్పెన్షన్, డ్యూయల్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్‌ లను కలిగి ఉంటుంది. UDOలో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. రేంజ్, రైడ్, రేస్. రేస్ లో గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. రివర్స్ థ్రోటిల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాఫిక్ మెయింటెనెన్స్ కోసం క్రీప్ ఫంక్షన్ ఉన్నాయి.

ఆరు సంవత్సరాల వ్యారెంటీ..

మహీంద్రా ఈ వాహనానికి 150,000 కిలోమీటర్లు లేదంటే ఆరు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. 100,000 కిలోమీటర్ల వరకు ఉచిత సర్వీసింగ్‌ను అందిస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ యొక్క UDAY NXT పథకంలో నమోదు చేయబడతారు. ఇది ఆర్థిక సలహా సేవలతో పాటు రూ. 20 లక్షల ప్రమాద బీమా కవరేజీని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలను జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో తయారు చేస్తోంది.

Advertisement

దేశ వ్యాప్తంగా అతి పెద్ద త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న మహీంద్రా ఇండియన్ మార్కెట్ లోకి UDOను విడుదల చేసింది. మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ ఈ ఆటోను తీసుకొచ్చింది. ప్రయాణీకులు, కార్గో అప్లికేషన్ల కోసం పలు ఎలక్ట్రిక్, సాంప్రదాయ ఇంధన త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ ను తయారు చేస్తుంది.

Read Also:  కళ్లు చెదిరేలా టయోటా హైలాండర్ EV 2027, ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా భయ్యా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×