Mahindra XUV 7XO 2026 Launch Date: స్టైలిష్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్న మహీంద్రా కంపెనీ, మరో అద్భుతమైన బైక్ ను విడుదల చేయబోతోంది. మహీంద్రా XUV700 పేరుతో పవర్ ఫుల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేయబోతోంది. కొత్త నేమింగ్ స్ట్రాటజీ ప్రకారం XUV 7XOగా రీబ్రాండ్ చేయబడింది. ఇంచుమించు XUV 3XO లాగా రూపొందుతోంది. ఈ కారుకు సంబంధించి మహీంద్రా ఇప్పటికే మల్టిపుల్ టీజర్లు రిలీజ్ చేసింది.
Mahindra XUV 7XO లాంచ్ డేట్
Mahindra XUV 7XO జనవరి 5, 2026న విడుదల కానుంది. ఒకేసారి గ్లోబల్ గా లాంచ్ చేయనున్నారు. మార్కెట్ లాంచ్, డెలివరీలు 2026 ఫస్ట్ క్వార్టర్ లో అంటే జనవరి చివర, ఫిబ్రవరి ప్రారంభం నుంచి ప్రారంభమవుతాయి. ఈ కారుకు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో, ఆన్‌లైన్, డీలర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Mahindra XUV 7XO ధర ఎంత ఉండొచ్చు?
Mahindra XUV 7XO ధర రూ.15 లక్షల నుంచి రూ. 26 లక్షల వరకు ఉండవచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత XUV700 ధర రూ.13.66-రూ.23.71 లక్షలు ఉంది. దాని కంటే కాస్త ఎక్కువగా పెరవగవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, ఇందులో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నారు. కచ్చితమైన ధరలు జనవరి 5న అనౌన్స్ అవుతాయి.
Mahindra XUV 7XO ఇంజిన్, పనితీరు
ఇంజిన్ ఆప్షన్లు ప్రస్తుత XUV700 నుంచి అలాగే కొనసాగుతాయి. ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. 2.0L టర్బో పెట్రోల్ 200 hp పవర్, 380 Nm టార్క్ తో రానుంది. 2.2L టర్బో డీజల్ 155 hp, 185 hp (వేరియంట్ బట్టి) అందుబాటులో ఉంటుంది. 360-450 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులో ఉంటుంది. AWD (ఆల్ వీల్ డ్రైవ్) డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. పవర్ ఫుల్, స్మూత్ డ్రైవ్, సిటీ, హైవే రెండింటికీ అనుకూలం. మైలేజ్ సుమారు 13-17 kmpl (వేరియంట్ బట్టి) ఉంటుంది.
Mahindra XUV 7XO ముఖ్య ఫీచర్లు
Mahindra XUV 7XOలో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. డ్రైవర్ డిస్‌ప్లే, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్ స్క్రీన్ ఉంటుంది. మహీంద్రా ICE SUVలో మొదటిసారి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. 540° కెమెరా, అప్‌డేటెడ్ Level-2 ADAS, ఇన్ కార్ థియేటర్ మోడ్ సపోర్ట్ ఉంటుంది. న్యూ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్ (7-షేప్ DRLs), కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, న్యూ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, ప్రీమియం డ్యూయల్ టోన్ (బీజ్,బ్రౌన్), ఎలక్ట్రిక్ బాస్ మోడ్, రియర్ వెంటిలేటెడ్ సీట్స్, Harman Kardon సౌండ్ సిస్టమ్ తో వస్తుంది. సీటింగ్ 6-సీటర్ లేదంటే 7-సీటర్ ఆప్షన్లుగా రావచ్చు. ఈ SUV టాటా సఫారి, హ్యుందాయ్ అల్కాజార్, MG హెక్టర్ ప్లస్ లతో పోటీ పడనుంది.
Read Also: స్టైలిష్ క్వాంటం ఎనర్జీ స్కూటర్లు, రేంజ్ కూడా బాగానే ఉందండోయ్!