E-Paper
Advertisement

పవర్ పెట్రోల్ తో మైలేజీ పెరుగుతుందా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియక ఎంత డబ్బు వేస్ట్ చేశానో!

పవర్ పెట్రోల్ తో మైలేజీ పెరుగుతుందా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియక ఎంత డబ్బు వేస్ట్ చేశానో!
Advertisement

Power Petrol Facts: పెట్రోల్ బంక్‌ కు వెళ్లినప్పుడు “పవర్ పెట్రోల్ పోయించుకోండిసర్” అనే మాట తరచుగా వింటుంటాం.   చాలా మంది పవర్ పెట్రోల్ సాధారణ పెట్రోల్ కంటే మంచిదని భావిస్తారు. కానీ, నిజానికి ప్రతి కారుకు పవర్ పెట్రోల్ అవసరం ఉండదు. సరైన అవగాహన లేకుండా వాడితే ఖర్చు మాత్రమే పెరుగుతుంది. కానీ, ప్రయోజనం ఏమాత్రం ఉండదు.

ఇంతకీ పవర్ పెట్రోల్ అంటే ఏంటి?

దీనిని ప్రీమియం, హై ఆక్టేన్ పెట్రోల్ అని కూడా పిలుస్తారు. సాధారణ పెట్రోల్‌ తో పోలిస్తే ఇందులో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మన దేశంలో రెగ్యులర్ పెట్రోల్ 87 నుంచి 91 ఆక్టేన్ మధ్య ఉండగా, పవర్ పెట్రోల్ 91 నుంచి 95, అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆక్టేన్ రేటింగ్ అంటే ఇంధనం ఎంత ఒత్తిడిని తట్టుకుని సమయానికి మండుతుందో చెప్పే క్యాలిక్యులేషన్.

Advertisement

పవర్ పెట్రోల్ అనేది హై పెర్ఫార్మెన్స్, టర్బో ఇంజిన్‌ల కోసం ఉపయోగపడుతుంది. ఈ ఇంజిన్‌లు ఎక్కువ ప్రెషర్‌తో పని చేస్తాయి కాబట్టి, హై ఆక్టేన్ ఉన్న ఫ్యూయెల్ అవసరం అవుతుంది. దీంతో ఇంజిన్ స్మూత్‌గా నడుస్తుంది. యాక్సిలరేషన్ కొంచెం మెరుగ్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మైలేజీ కూడా స్వల్పంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇంజిన్ నాకింగ్ అనే సమస్యను తగ్గిస్తుంది. అంటే ఇంధనం ముందే మండిపోవడం వల్ల ఇంజిన్‌కు వచ్చే నష్టం తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన లాభం ఏమిటంటే, పవర్ పెట్రోల్‌ లో ప్రత్యేకమైన క్లీనింగ్ యాడిటివ్స్ ఉంటాయి. ఇవి ఇంజిన్ లోపల కార్బన్ పేరుకుపోకుండా సహాయపడతాయి. ఫ్యూయల్ ఇంజెక్టర్లు, వాల్వ్‌ లు లాంటి భాగాలు శుభ్రంగా ఉండటం వల్ల ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా డ్రైవ్ చేసే వారికి ఇది కొంత ఉపయోగపడుతుంది.

చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే?

చాలా మంది సాధారణ కార్లలో కూడా పవర్ పెట్రోల్ వాడుతుంటారు. నిజానికి సాధారణ పెట్రోల్‌ తో నడిచేలా డిజైన్ చేసిన ఇంజిన్‌ లకు ఇది పెద్దగా లాభం ఉండదు. అదనపు పవర్, మైలేజీ స్పష్టంగా కనిపించదు. కానీ లీటరుకు రూ. 5 నుంచి 10 వరకు అదనంగా ఖర్చవుతుంది. అంటే అవసరం లేకుండా డబ్బు వృథా అవుతుంది.

పవర్ పెట్రోల్ ఎప్పుడు వాడాలి?

Advertisement

అయితే పవర్ పెట్రోల్ ఎప్పుడు వాడాలంటే, కారులో టర్బో ఇంజిన్ ఉంటే లేదంటే కంపెనీ స్పష్టంగా హైఆక్టేన్ పెట్రోల్ వాడమని సూచిస్తేనే వాడాలి. అలాగే, సుదూర ప్రయాణాలు, పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, తీవ్రమైన వేడి వాతావరణంలో డ్రైవ్ చేసే సమయంలో కూడా ఉపయోగపడుతుంది. సో, ప్రతి కారుకు పవర్ పెట్రోల్ అవసరం అనుకోవడం ఒక అపోహ మాత్రమే. కారు ఏ ఫ్యూయెల్ కోసం తయారు చేయబడిందో తెలుసుకుని వాడటం మంచిది. అవసరమైతే అప్పుడప్పుడు ప్రీమియం పెట్రోల్ వాడాలి. సరైన ఇంధనం వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, ఇంజిన్ కూడా మంచి కండీషన్ లో ఉంటుంది.

Read Also: వాగన్ఆర్ To ఫార్చ్యూనర్.. రీసేల్‌ లో కింగ్ కార్లు ఇవే గురూ!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×