E-Paper
Advertisement

వాగన్ఆర్ To ఫార్చ్యూనర్.. రీసేల్‌ లో కింగ్ కార్లు ఇవే గురూ!

వాగన్ఆర్ To ఫార్చ్యూనర్.. రీసేల్‌ లో కింగ్  కార్లు ఇవే గురూ!
Advertisement

Best Resale Value Cars in India 2026: సాధారణంగా కారు కొనేటప్పుడు చాలా మంది మైలేజీ, ఫీచర్లు, ధర లాంటి అంశాలపై దృష్టి పెడతారు. కానీ, కొన్నేళ్ల తర్వాత కారును అమ్మాలనుకుంటే రీసేల్ విలువ ఎంత వస్తుందో కూడా చూసుకోవడం మంచిది. మన దేశంలో కొన్ని కార్లు  చాలా కాలం వాడినా మంచి రీసేల్ వ్యాల్యూను కలిగి ఉంటాయి. వీటికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ లో మంచి ధరకు అమ్ముడవుతాయి. అలాంటి టాప్ 7 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి వాగన్ఆర్

సింపుల్ డిజైన్, లో మెయింటెనెన్స్ ఖర్చు, మంచి మైలేజీతో దీన్ని ఫ్యామిలీ కారుగా పాపులర్ చేశాయి. చిన్న పట్టణాల్లో వాగన్ఆర్‌కు డిమాండ్ ఇంకా ఎక్కువ. అందుకే 3 నుంచి 5 సంవత్సరాల పాత కారుకి కూడా మంచి రీసేల్ వస్తుంది.

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్

Advertisement

యూత్‌ లో ఇది చాలా క్రేజ్ ఉన్న హ్యాచ్‌ బ్యాక్. డ్రైవింగ్ సులభం, మెయింటెనెన్స్ తక్కువ, స్పోర్టీ లుక్ కారణంగా మంచి డిమాండ్ ఉంటుంది. పాత మోడల్స్ కూడా సులభంగా అమ్ముడవుతాయి. అందుకే దీని విలువ అంతగా తగ్గదు.

⦿  టయోటా ఇన్నోవా క్రిస్టా

రీసేల్ వాల్యూలో ఇదో స్టాండర్డ్ లాంటిది. దీనికి మెయిన్ రీజ్ మన్నిక. లక్షల కిలోమీటర్లు నడిచినా పెద్ద సమస్యలు రావు. ఫ్యామిలీ ఉపయోగం మాత్రమే కాదు, టాక్సీ, ట్రావెల్ రంగంలో కూడా విస్తృతంగా వాడటం వల్ల ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే పాత ఇన్నోవా కూడా మంచి ధరకు అమ్ముడవుతుంది.

⦿ హోండా సిటీ

Advertisement

కూడా చాలా కాలంగా నమ్మకమైన సెడాన్‌గా గుర్తింపు పొందింది. దీని ఇంజన్ పనితీరు, స్మూత్ డ్రైవ్ ఎక్స్ పీరియెన్స్  కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. SUVలు పెరిగినా, సెడాన్లను ఇష్టపడే వాళ్లలో సిటీకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే పాత మోడల్స్‌ కు కూడా మంచి రీసేల్ వస్తుంది.

మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో చాలా సంవత్సరాలుగా లీడర్‌గా కొనసాగుతోంది. కొత్త మోడల్ అయితే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది. డిజైన్, ఫీచర్లు, బ్రాండ్ ఇమేజ్ దీని రీసేల్ వాల్యూను పెంచుతాయి. పాత మోడల్ అయినా కూడా మార్కెట్‌ లో మంచి ధరకు అమ్ముడవుతుంది.

⦿  టయోటా ఫార్చ్యూనర్

ఇది SUV మాత్రమే కాదు, ఒక స్టేటస్ సింబల్‌గా కూడా భావిస్తారు. బలమైన నిర్మాణం, రోడ్డు మీద ఉన్న ప్రెజెన్స్, బ్రాండ్ నమ్మకం కారణంగా డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. అందుకే 5-6 సంవత్సరాల పాత కారుకి కూడా చాలా ఎక్కువ రీసేల్ వ్యాల్యూ వస్తుంది.

⦿ మహీంద్రా స్కార్పియో

దీనికి గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ SUV మంచి బిల్డ్ క్వాలిటీ, రఫ్ యూజ్‌ కు సరిపోవడం, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా స్కార్పియోకు ఎప్పుడూ మంచి వాల్యూను కలిగి ఉంటారు. పాత మోడల్స్ కూడా సులభంగా అమ్ముడవుతాయి.

Read Also: కియా క్రేజీ ప్లాన్.. భారత మార్కెట్ లోకి ఏకంగా 5 కొత్త కార్లు!

Related News

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×