E-Paper
Advertisement

హర్మూజ్ జలసంధిలో అమెరికాకు భారీ దెబ్బ.. రూ. 2200 కోట్ల డ్రోన్ గల్లంతు!

హర్మూజ్ జలసంధిలో అమెరికాకు భారీ దెబ్బ.. రూ. 2200 కోట్ల డ్రోన్ గల్లంతు!
Advertisement

MQ-4C Triton drone crash: హర్మూజ్ జలసంధి మీదుగా నిఘా విధుల్లో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత ఖరీదైన MQ-4C Triton డ్రోన్ గల్లంతైనట్లు అమెరికా రక్షణ శాఖ ధ్రువీకరించింది. సుమారు రూ. 2,200 కోట్ల ($240 మిలియన్లు) విలువైన ఈ డ్రోన్ ఏప్రిల్ 9వ తేదీన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కూలిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఏప్రిల్ 9న ఈ డ్రోన్ పర్షియన్ గల్ఫ్.. హర్మూజ్ జలసంధి మీదుగా తన మూడు గంటల నిఘా మిషన్‌ను పూర్తి చేసుకుని, ఇటలీలోని సిగోనెల్లా నేవల్ బేస్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గగనతలంలో సుమారు 50,000 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో డ్రోన్ నుండి ‘7700’ (అత్యవసర పరిస్థితి), ‘7400’ (కమ్యూనికేషన్ ఫెయిల్యూర్) సిగ్నల్స్ వెలువడ్డాయి. ఆ తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే అది 10,000 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు పడిపోయి, ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ల నుండి అదృశ్యమైంది.

Advertisement

అయితే, అమెరికా నేవీ దీనిని ఒక ప్రమాదంగా మాత్రమే అభివర్ణించింది. పర్షియన్ గల్ఫ్ అంతర్జాతీయ గగనతలంలో ఇది కూలిపోయిందని, ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పేర్కొంది. కానీ, ఇరాన్ గతంలో (2019లో) ఇలాంటిదే ఒక గ్లోబల్ హాక్ డ్రోన్‌ను కూల్చివేసిన చరిత్ర ఉన్నందున, తాజా ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్రోన్‌ను ఇరాన్ క్షిపణి దాడుల ద్వారా కూల్చివేసిందనే ప్రచారం అంతర్జాతీయ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

ఎంక్యూ-4సీ ట్రైటాన్ అనేది అమెరికా వద్ద ఉన్న అత్యంత అరుదైన, అధునాతన నిఘా డ్రోన్. అమెరికా నౌకాదళం వద్ద ఇలాంటివి కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో డ్రోన్ తయారీకి సుమారు 240 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2,200 కోట్లు) ఖర్చవుతుంది. ఇది 24 గంటల పాటు నిరంతరాయంగా గగనతలంలో ఉంటూ సముద్రంలోని నౌకల కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షించగలదు. అగ్రరాజ్యం చమురు రవాణా మార్గమైన హర్మూజ్‌పై పట్టు కోసం దీనిని వాడుతుండగా, ఇలాంటి కీలకమైన డ్రోన్‌ను కోల్పోవడం అమెరికాకు భారీ ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.

Advertisement

Read Also: ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ మలక్కా జలసంధి.. చైనాకు చెక్ పెట్టేందుకు పావులు, ఇండియా కీ రోల్ తప్పదా?

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×