E-Paper
Advertisement

కొత్త స్టైల్.. సరికొత్త కలర్స్.. రివోల్ట్ RVX వచ్చేసింది!

కొత్త స్టైల్.. సరికొత్త కలర్స్.. రివోల్ట్ RVX వచ్చేసింది!
Advertisement

Revolt RVX India Launch: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి రివోల్ట్ మోటార్స్ కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది.  దీని ప్రారంభ ధర రూ.1,24,990గా నిర్ణయించింది. ప్రభుత్వ సబ్సిడీలతో ఈ ధర వర్తిస్తుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న RV400తో పోలిస్తే, RVXలో డిజైన్, పనితీరు, ఫీచర్ల పరంగా కొన్ని కీలక మార్పులు చేశారు. కొత్త కలర్ ఆప్షన్లు ఈ బైక్‌కు మరింత స్టైలిష్ లుక్‌ ను తీసుకొచ్చాయి.

మూడు రంగుల్లో రివోల్ట్ RVX

రివోల్ట్ RVX ప్రస్తుతం రెబెల్ రెడ్, ఎలక్ట్రిక్ బ్లూ, కాస్మిక్ బ్లాక్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రతి కలర్‌ కు ప్రత్యేకమైన డిజైన్, గ్రాఫిక్స్ ఉండటంతో వినియోగదారులు తమకు నచ్చిన ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

రెబెల్ రెడ్

Advertisement

రెబెల్ రెడ్ కలర్ బైక్‌ను మరింత క్రేజీ లుక్ తో ఆకట్టుకుంటుంది. RV400లోని ఎక్లిప్స్ రెడ్ కలర్ ను పోలి ఉన్నప్పటికీ, RVXలో ఈ ఎరుపు షేడ్ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిపై ఉన్న తెలుపు రంగు గ్రాఫిక్స్ బైక్‌ కు స్పోర్టీ, బోల్డ్ లుక్‌ ను అందిస్తున్నాయి. రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించే బైక్ కోరుకునే వారికి ఈ కలర్ మంచి ఎంపికగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ బ్లూ

ఎలక్ట్రిక్ బ్లూ కలర్ కూడా యువతను ఆకట్టుకునేలా రూపొందించారు. బ్లూ కలర్ తో పాటు రెబెల్ రెడ్ లాగే ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ ఇందులో ఉన్నాయి. ఈ కలర్ కూడా చాలా బోల్డ్‌ గా కనిపిస్తుంది. రెడ్, బ్లూ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేది పూర్తిగా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది.

కాస్మిక్ బ్లాక్

Advertisement

కాస్మిక్ బ్లాక్ మూడు రంగుల్లో అత్యంత ప్రీమియంగా కనిపించే ఆప్షన్. మొత్తం బైక్ నలుపు రంగులో ఉండగా, దాని మీద వైట్, గోల్డెన్ కలర్ గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలోని ఇన్వర్టెడ్ ఫోర్క్‌ కు బంగారు రంగు ఫినిషింగ్ ఇవ్వడం వల్ల బైక్‌ కు మరింత ప్రీమియం లుక్ వచ్చింది. సింపుల్ అయినా క్లాస్‌ గా కనిపించే బైక్ ఇష్టపడే వారికి ఈ కలర్ బాగా నచ్చే అవకాశం ఉంది.

గంటకు 90 కి.మీ వేగం

డిజైన్ పరంగా మాత్రమే కాకుండా, పనితీరు విషయంలో కూడా రివోల్ట్ RVX మంచి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇందులో 5.3kW సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌ ను ఉపయోగించారు. ఈ మోటార్ ద్వారా బైక్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. సిటీ ప్రయాణాలతో పాటు రోజువారీ వినియోగానికి ఈ వేగం సరిపోతుంది.  బైక్‌లో 3.24kWh సామర్థ్యం కలిగిన రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. అవసరమైతే బ్యాటరీని బయటకు తీసి ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే  గరిష్టంగా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

Read Also: 180 కి.మీ రేంజ్.. రిమూవబుల్ బ్యాటరీ.. కీవే క్రేజీ స్కూటర్ వచ్చేసింది!

Related News

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×