E-Paper
Advertisement

180 కి.మీ రేంజ్.. రిమూవబుల్ బ్యాటరీ.. కీవే క్రేజీ స్కూటర్ వచ్చేసింది!

180 కి.మీ రేంజ్.. రిమూవబుల్ బ్యాటరీ.. కీవే క్రేజీ స్కూటర్ వచ్చేసింది!
Advertisement

Keeway Hypvolt-R India Launch: ప్రముఖ టూవీలర్ కంపెనీ కీవే ఇండియా భారత మార్కెట్‌ లో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను విడుదల చేసింది. ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చిన ఈ కొత్త స్కూటర్ ను హైప్‌ వోల్ట్ ఆర్  పేరుతో మార్కెట్ కు పరిచయం చేసింది. ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌ ను టార్గెట్ చేసుకుని తీసుకొచ్చిన ఈ మోడల్ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ స్కూటర్ క్రిస్టల్ వైట్, ప్లాటినం గ్రే అనే రెండు కలర్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. కొనాలనుకునే వారు రూ.5,000 టోకెన్ అమౌంట్ పే చేసి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

2.3 సెకెన్లలో 40 కి.మీ వేగం

కీవే హైప్‌ వోల్ట్ ఆర్‌ లో మధ్య భాగంలో అమర్చిన పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్‌ ను ఉపయోగించారు. ఈ మోటార్ గరిష్టంగా 12kW పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 2.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగం, పనితీరు రెండింటినీ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

ఈ స్కూటర్‌ లో మూడు రైడింగ్ మోడ్‌ లు అందుబాటులో ఉన్నాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే ఈ మూడు మోడ్‌ ల ద్వారా అవసరానికి అనుగుణంగా పనితీరును మార్చుకునే అవకాశం ఉంటుంది. సిటీలో రోజువారీ ప్రయాణాలకు ఎకో మోడ్ ఉపయోగపడితే, మెరుగైన పనితీరు కోసం స్పోర్ట్ మోడ్‌ ను ఉపయోగించుకోవచ్చు.

ఫుల్ ఛార్జ్ తో 180 కి.మీ ప్రయాణం

హైప్‌ వోల్ట్-ఆర్‌ లో 5kWh సామర్థ్యం కలిగిన రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ ను అందించారు. ఈ బ్యాటరీ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే IDC నివేదిక ప్రకారం గరిష్టంగా 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీని స్కూటర్‌ లోనే ఉంచి ఛార్జ్ చేయవచ్చు. అవసరమైతే బయటకు తీసి కూడా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంది. బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల పరంగా కూడా ఈ స్కూటర్‌లో అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ రివర్స్ కెమెరా లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ప్రొజెక్టర్ LED హెడ్‌ ల్యాంప్‌ లు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 5 అంగుళాల TFT డిస్‌ ప్లే, రివర్స్ మోడ్, సీటు కింద 27 లీటర్ల స్టోరేజ్ స్పేస్, USB టైప్ A, టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ లు కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి రేంజ్, శక్తివంతమైన పనితీరు, అధునాతన ఫీచర్లతో కీవే హైప్‌ వోల్ట్ ఆర్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: పల్సర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. N125 ఉత్పత్తి నిలిపివేత!

Related News

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×