E-Paper
Advertisement

Royal Enfield Goan Classic 350: రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 లాంచ్, ధర ఎంతో తెలుసా?

Royal Enfield Goan Classic 350:  రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 లాంచ్, ధర ఎంతో తెలుసా?
Advertisement

2016 Royal Enfield Goan Classic 350: రాయల్ ఎన్ఫీల్డ్ దేశీ మోటార్ సైకిల్ మార్కెట్ లోకి సరికొత్త బైక్ ను లాంచ్ చేసింది. గోవాన్ క్లాసిక్ 350  2026 వెర్షన్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. గతంతో పోల్చితే ఈ మోటార్‌ సైకిల్‌కు రెండు చిన్న చిన్న అప్ డేట్స్ ఉన్నాయి. అయితే, ధర విషయంలో ఎలాంటి తేడాలు లేకపోవడం విశేషం. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 సింగిల్ టోన్ కలర్స్ వేరియంట్స్ ధర రూ. 2.20 లక్షలు కాగా, డ్యూయల్ టోన్ కలర్ వేరియెంట్స్ కు రూ. 2.22 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఎక్స్ షోరూమ్ ధరలతో పోల్చితే ఆన్ రోడ్ ధరలు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది.

కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 ఛేంజెస్ ఇవే!

గోవాన్ క్లాసిక్ 350 2026 చిన్న మార్పులతో అందుబాటులోకి వచ్చింది. కొత్త అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌ తో వచ్చింది. ఇది తేలికైన క్లచ్  రియాక్షన్ ను అందించడంలో సాయపడుతుంది. డౌన్‌ షిఫ్టింగ్‌ లో బ్యాక్ వీల్ లాక్ అవ్వకుండా అడ్డుకుంటుంది. అంతే కాకుండా, గోవాన్ క్లాసిక్‌లో ఇప్పటికే ఉన్న USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్ట్ గా చేస్తుంది. ఇక ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గత మోడల్ మాదిరిగానే ఉన్నాయి.

Advertisement

Read Also: హోండా CB350 vs రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

గోవాన్ క్లాసిక్ 350 హైలైట్

తక్కువ స్లంగ్ ప్రొఫైల్, ప్రత్యేక డిజైన్ లాంటి అంశాలతో కూడిన బాబర్ ప్రేరేపిత స్టైలింగ్ గోవాన్ క్లాసిక్ 350 హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇది ఫ్లోటింగ్ స్టైల్ సింగిల్ సీట్, మినీ ఏప్ హ్యాంగర్ హ్యాండిల్ బార్,  వైట్ సైడ్ వాల్స్‌ తో కూడిన క్రాస్ స్పోక్ ట్యూబ్‌ లెస్ వీల్స్‌ తో వస్తుంది. ఇవన్నీ గోవాన్ క్లాసిక్ 350కి అద్భుతమైన లుక్ ను తీసుకొస్తున్నాయి. ఈ బైక్ పవర్ ఫుల్ ఇంజిన్ తో వస్తుంది. 349cc  ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 20.2bhp పవర్ ను కలిగి ఉంటుంది. 27Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ఐదు స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: ఇక ఈవీ కార్లకు ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హ్యుందాయ్!

గోవాన్ క్లాసిక్ 350 హైలైట్ ఎన్ని రంగుల్లో వస్తుందంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 2026 గతంలో మాదిరిగానే పలు రంగుల్లో అందుబాటులోకి రానుంది. షాక్ బ్లాక్, పర్పుల్ హేజ్, ట్రిప్ టీల్ గ్రీన్, రేవ్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది. ఒకవేళ మీకు కూడా ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే, సమీపంలోని రాయల్ ఎన్ఫీల్డ్ షో రూమ్ కు వెళ్లండి. టెస్ట్ రైడ్ బుక్ చేసుకోండి.

Read Also: వచ్చేస్తోంది నెక్స్ట్ జనరేషన్ పల్సర్, లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×