మార్కెట్లోకి రీసెంట్ గా 350 సీసీ సెగ్మెంట్ లో హోండా CB350, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండూ రెట్రో స్టైల్ మోటార్ సైకిల్స్ గా పరిచయం అయ్యాయి. హోండా CB350 మరింత మోడర్న్ రిఫైన్‌మెంట్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ట్రెడిషనల్ లుక్, హెరిటేజ్ తో గుర్తింపు పొందింది. ఈ రెండు బైక్స్ సంబంధించి ధరలు, స్పెసిఫికేషన్లు, ధరలు సహా పూర్తి వివరాలను తెలుసుకుందాం. అదే సమయంలో ఏది బెస్ట్ అనేది చూద్దాం..
హోండా CB350 ధర రూ. 1.97 లక్షలు నుంచి రూ.2.18 లక్షలు వరకు ఉంటుంది. వేరియెంట్లను బట్టి మారుతుంది. అటు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ. 1.83 లక్షల నుంచి రూ.2.20 లక్షలు వరకు ఉంటుంది. సింగిల్ ఛానల్ ABS నుంచి టాప్ వేరియంట్స్ వరకు, వివిధ కలర్ ఆప్షన్స్ ను బట్టి ధర మారుతుంది. క్లాసిక్ 350 బేస్ వేరియంట్ తక్కువ ధరకు లభిసతుంది. కానీ టాప్ వేరియంట్స్ లో రెండూ ఇంచుమించు ఒకే ధరను కలిగి ఉంటాయి.
హోండా CB350 348.36 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 20.7 నుంచి 21.07 bhp పవర్ ను కలిగి ఉంటుంది. 29.4 నుంచి 29.5 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 42.17కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. 135 టాప్ స్పీడ్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. 15.2 లీటర్ల ప్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.
ఈ బైక్ లో 349 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 20.2 bhp పవర్ ను కలిగి ఉంటుంది. 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 41.55 కిలో మీటర్ల మైలేజ్, 125 కిలో మీటర్ల టాప్ స్పీడ్ అందిస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.
ఈ రెండు బైక్స్ లో హోండా CB350 మరింత పవర్, టార్క్ కలిగి ఉంది. బెటర్ మైలేజ్, తక్కువ బరువు వల్ల హ్యాండ్లింగ్ సులభంగా ఉంటుంది. క్లాసిక్ 350 హెవీ ఫీల్, క్లాసిక్ వైబ్రేషన్స్ తో వస్తుంది.
డిజైన్ పరంగా ఈ రెండు బైక్స్ రెట్రో క్లాసిక్ స్టైల్ లో ఉంటాయి. హోండా CB350 మరింత మోడర్న్, కాంపాక్ట్ లుక్ లో ఉంటుంది. క్లాసిక్ 350 ట్రెడిషనల్ ఎన్ఫీల్డ్ హెరిటేజ్ ను కలిగి ఉంటుంది. హోండా డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జర్, హజార్డ్ లైట్స్ ఉంటాయి. క్లాసిక్ 350లో సెమీ డిజిటల్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్, సింగిల్, డ్యూయల్ సీట్ ఆప్షన్స్, బెటర్ సౌండ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. మోడర్న్ ఫీచర్లు, బెటర్ మైలేజ్, తక్కువ బరువు, స్మూత్ రైడ్ కావాలంటే హోండా CB350ను తీసుకోవాలి. క్లాసిక్ లుక్, హెరిటేజ్ ఫీల్, లాంగ్ టూరింగ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: మార్కెట్లోకి అడుగు పెట్టిన KTM RC 160.. యమహా R15Mతో పోల్చితే బెస్టా? కాదా?