Putin’s Aurus Senat car: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఫుతిన్ రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ భారత్ కు రానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రాత్రి 7 గంటలకు ఆయన విమానం ఢిల్లీలో ల్యాండ్ కానుంది. సుమారు 4 సంవత్సరాల తర్వాత ఫుతిన్ భారత్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పలు అంశాలకు సంబంధించి కీలక చర్చలు జరుపుతారు. ముఖ్యంగా రక్షణ, వాణిజ్య సంబంధాలపై సమాలోచనలు జరపనున్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొంటారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో పలు బిజినెస్ సమ్మిట్స్ కు హాజరవుతారు.
భారత పర్యటనకు వస్తున్న ఫుతిన్ తనతో పాటు భద్రతా కాన్వాయ్ ని కూడా తెచ్చుకుంటున్నారు. ఆయన వచ్చే విమానంలోనే దానిని తీసుకురాబోతున్నారు. ఆరస్ సెనాట్ అని పిలిచే ఈ కారు ప్రపంచంలోని అత్యంత భద్రతతో కూడిన కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. రష్యన్ రోల్స్ రాయిస్ అని పిలిచే ఈ కారు ఆర్మర్డ్ షెల్, బ్లాక్ అవుట్ విండోలు, అద్భుతమైన హైటెక్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. ఈ స్వదేశీ మోడల్ కారను ఉపయోగించడానికి ముందు పుతిన్ మెర్సిడెస్ బెంజ్ S 600 గార్డ్ పుల్ మ్యాన్ ను ఉపయోగించారు. కానీ, ఆ తర్వాత ఈ కారును ఉపయోగించడం మొదలుపెట్టింది.
2018 నుంచి ఆరస్ సెనాట్ ను పుతిన్ ఉపయోగించడం మొదలు పెట్టారు. దీనిని రష్యాకు చెందిన NAMI ఇన్‌స్టిట్యూట్, సోల్లర్స్ JSC, UAEకి చెందిన తవాజున్ హోల్డింగ్ సహకారంతో ఆరస్ మోటార్స్ తయారు చేసింది. ఈ మోడల్ కార్లు పరిమిత సివిలియన్ వెర్షన్ లో అందుబాటులో ఉన్నాయి. సంవత్సరానికి దాదాపు 120 యూనిట్లను తయారు చేస్తుంది.
ఆరస్ సెనాట్ కారును అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేలా రూపొందించారు. ఎందుకంటే..
⦿ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ నిర్మాణం: దీని ఆర్మర్డ్ షెల్ హై క్యాలిబర్ బుల్లెట్లు, ఆర్మర్ పియర్సింగ్ రౌండ్లను తట్టుకుంటుంది.
⦿ క్షిపణి, డ్రోన్ దాడి నుంచి రక్షణ: శక్తివంతమైన పేలుళ్లు, వైమానిక దాడులను తట్టుకునేలా దీనిని రూపొందించారు.
⦿ జలాంతర్గామి లాంటి సామర్థ్యం: ప్రమాదవశాత్తు ఈ కారు నీటిలో పడితే బెలూన్ లా తేలుతుంది. సురక్షిత ప్రదేశానికి చేరుకునే వరకు అలాగే తేలుతుంది.
⦿ రన్ ఫ్లాట్ మొబిలిటీ: ఈ కారుకు ఉన్న నాలుగు టైర్లు దెబ్బతిన్నా, కారు అధిక వేగంతో ముందుకు సాగుతుంది.
⦿ కెమికల్ దాడి నుంచి రక్షణ: విష వాయువులను లోపలికి రావ్వకుండా ఉంచేలా క్యాబిన్ ఇండిపెండెంట్ ఎయిర్ ఫిల్టర్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
⦿ హై పర్ఫార్మెన్స్: ఇది 4.4-లీటర్ ట్విన్ టర్బో V8 హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది దాదాపు 6-9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. అధునాతన లగ్జరీ ఇంటీరియర్ ను కలిగి ఉంటుంది. వెదర్ కంట్రోల్, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి.
బేస్ ఆరస్ సెనాట్ సుమారు 18 మిలియన్ రూబిళ్లు ( భారత కరెన్సీలో సుమారు రూ. 2.5 కోట్లు) నుంచి ప్రారంభం అవుతుంది. ప్రెసిడెంట్ పుతిన్ కోసం మోడిఫై చేసిన కారు పూర్తిగా ఆర్మర్డ్ స్టేట్ వెర్షన్ లో అందుబాటులో ఉంటుంది. పూర్తి భద్రతా సాంకేతికతను కలిగి ఉంటుంది. ఇది దాదాపు రెండు రెట్లు ఖరీదైనదిగా ఉంటుంది. ఇటువంటి వెర్షన్లు సాధారణ పౌరులకు అందుబాటులో లేవు.
సెప్టెంబర్ లో, చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం తర్వాత ప్రధాని మోడీ, పుతిన్ ఈ కారులోనే ప్రయాణించారు. ప్రధాని మోడీతో ప్రయాణించడానికి పుతిన్ దాదాపు పది నిమిషాలు వేచి ఉన్నారు. డ్రైవ్ సమయంలో ఇద్దరు నాయకులు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నారు.
Read Also: రేపే కోల్డ్ సూపర్ మూన్.. ఇప్పుడు మిస్సయితే మళ్లీ 2042 వరకు చూడలేం, ఎందుకంటే?