E-Paper
Advertisement

Cold Super Moon: రేపే కోల్డ్ సూపర్ మూన్.. ఇప్పుడు మిస్సయితే మళ్లీ 2042 వరకు చూడలేం, ఎందుకంటే?

Cold Super Moon: రేపే కోల్డ్ సూపర్ మూన్.. ఇప్పుడు మిస్సయితే మళ్లీ 2042 వరకు చూడలేం, ఎందుకంటే?
Advertisement

Cold Super Moon December 2025: డిసెంబర్ 4, 2025.. చంద్రుడు ఈ దశాబ్దంలోనే భూమికి అత్యంత దగ్గరగా కనిపించబోతున్నాడు. అత్యంత ప్రకాశవంతంగా అలరించబోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సూపర్ మూన్స్ కనిపించగా, ఇది చివరి సూపర్ మూన్ కానుంది. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో అత్యంత స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత కాసేపటికే అత్యంత అద్భుతంగా ఆకట్టుకోనుంది. చందమామ ఈ ఏడాది అత్యంత దగ్గర కనిపించనుంది. ఇది సాధారణ పౌర్ణమి కంటే 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనుంది. ఒకవేళ ఈసారి కోల్డ్ సూపర్‌ మూన్ చూడ్డం మిస్ అయితే, మళ్లీ 2042 వరకు కనిపించదని  శాస్త్రవేత్తలు వెల్లడించారు. శీతాకాలంలో అతి పెద్దగా కనిపించే మూన్ ను కోల్డ్ సూపర్‌ మూన్ అని పిలుస్తారు.

ఇంతకీ ఏంటీ సూపర్‌ మూన్?  

సూపర్‌ మూన్ అంటే చంద్రుడు పూర్తి పరిమాణంలో భూమికి అతి సమీపంలోకి వస్తుంది. సాధారణంగా చంద్రుడు భూమి నుంచి 3,84,000 కి.మీ దూరంలో ఉంటుంది. కానీ, సూపర్‌ మూన్‌ సమయంలో 3,57,000 కి.మీ. వరకు సమీపంగా వస్తుంది. ఈ సమయంలో చంద్రుడు పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. 2025లో మొత్తం మూడు సూపర్‌ మూన్‌లు వచ్చాయి. అక్టోబర్ (హార్వెస్ట్ మూన్), నవంబర్ (బీవర్ మూన్) రాగా, డిసెంబర్ (కోల్డ్ మూన్) వస్తుంది.

ఎక్కడ? మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది?

Advertisement

ఇండియాలో డిసెంబర్ 4, 2025 ఉదయం 4.44 గంటలకు కోల్డ్ సూపర్ మూన్ అద్భుతంగా కనిపించనుంది. డిసెంబర్ 3, 4, 5 రాత్రులు కూడా ప్రకాశంతంగానే కనిపిస్తుంది. మనదేశంలో డిసెంబర్ 4న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్, చెన్నైలో  అద్భుతంగా కనిపించనుంది.

కోల్డ్ సూపర్ మూన్ ను ఎలా చూడాలి?

⦿ బెస్ట్ స్పాట్స్: ఈస్టర్న్ హారిజన్‌ కు క్లియర్ వ్యూ ఉన్న చోట్లలో కోల్డ్ సూపర్ మూన్ అద్భుతంగా కనిపిస్తుంది. బీచ్‌లు, ఓపెన్ ఫీల్డ్స్, లైట్ పొల్యూషన్ తక్కువ ప్రాంతాలు. భారత్‌ లో హిమాలయాలు, కోస్టల్ ఏరియాల్లో అద్భుతంగా కనిపిస్తుంది.

Advertisement

⦿ టైమింగ్:  హారిజన్ సమీపంలో  మూన్ ఇల్యూషన్ వల్ల మరింత పెద్దగా కనిపిస్తుంది.

Read Also: పాము కాటేసిందని వేలు కట్ చేసుకున్నాడు.. డాక్టర్ చెప్పింది విని బుర్ర బాదుకున్నాడు!

⦿ టిప్స్: టెలిస్కోప్, బైనాకులర్స్ ఉపయోగించండి చూస్తే మరింత అద్భుతంగా కనిపిస్తుంది. భారత్‌ లో ఈ మూన్ మరింత క్లియర్ గా ఉంటుంది. ఫోటోలు తీస్తే వైడ్ లెన్స్ ఉపయోగించడం మంచిది.

⦿ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్: ఇది 2025లో రెండో పెద్ద సూపర్‌ మూన్. ఈ ఏడాది అతి దగ్గరగా కనిపిస్తుంది.

మీరు కూడా ఈ అద్భుతమైన మూన్ చూడాలంటే మంచి స్పాట్ కు వెళ్లండి. ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయండి.

Read Also:  మీకు తెలుసా? కోడి కూడా డైనోసారే.. ఇవిగో దాని ఫ్యామిలీ డిటైల్స్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×