E-Paper
Advertisement

Best Helmets For Ladies: స్టైల్ అండ్ సేఫ్టీ.. లేడీస్ కోసం బెస్ట్ హెల్మెట్స్ ఇవే!

Best Helmets For Ladies:  స్టైల్ అండ్ సేఫ్టీ.. లేడీస్ కోసం బెస్ట్ హెల్మెట్స్ ఇవే!
Advertisement

మహిళలు పెట్రోల్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లను పెద్ద సంఖ్యలో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ తయారీ కంపెనీలు వారికి అనుకూలమైన హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో మహిళలకు సురక్షితమైన, స్టైలిష్ హెల్మెట్లు బోలెడు ఉన్నాయి. వీటిలో పలు హెల్మెట్లు ISI, ECE సర్టిఫికేషన్ తో పాటు తేలికపాటి బరువు, మంచి వెంటిలేషన్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం మహిళల కోసం అందుబాటులో ఉన్న బెస్ట్  హెల్మెట్లలో వేగా, స్టీల్‌ బర్డ్, స్టడ్స్, అక్సోర్, టివిఎస్ మిస్ ఫిట్ లాంటి బ్రాండ్లు ఉన్నాయి. స్టైలిష్, తేలికైన డిజైన్లతో మహిళల కోసం హెల్మెట్లను అందిస్తున్నాయి.

మహిళల కోసం టాప్ 5 హెల్మెట్స్   

⦿ వేగా: వేగా కంపెనీ తేలికైన, రంగు రంగుల డిజైన్లలో మహిళలకు హెల్మెట్స్ అందిస్తోంది. UV రెసిస్టెంట్ షీల్డ్, ఓపెన్ ఫేస్ ఆప్షన్స్ ను కలిగి ఉంటాయి.

Advertisement

⦿ స్టీల్‌ బర్డ్: ఈ కంపెనీకి చెందిన హెల్మెట్లు సరసమైన ధరలో స్టైలిష్, ISI సర్టిఫికేషన్ తో అందుబాటులో ఉన్నాయి.

⦿ TVS మిస్ ఫిట్: ఈ కంపెనీకి చెందిన హెల్మెట్లు స్కూటర్లకు బాగా సరిపోయేలా ఉంటాయి. కాంపాక్ట్, స్టడీ, ఎలిగెంట్ లుక్‌ తో ఉంటాయి.

Advertisement

⦿ అక్సోర్, SMK: ఈ రెండు కంపెనీలకు చెందిన హెల్మెట్లు మరింత ప్రొఫెషనల్ గా, సురక్షితమైన ప్రయాణాల కోసం ECE సర్టిఫైడ్, టాప్ క్వాలిటీతో అందుబాటులో ఉన్నాయి.

⦿ స్టడ్స్: ఈ కంపెనీకి చెందిన పలు రకాల ఓపెన్ ఫేస్, ఫుల్ ఫేస్ హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి.

హెల్మెట్స్ రకాలు

⦿ ఫుల్ ఫేస్ హెల్మెట్లు: ఇవి అత్యంత సేఫ్ గా  ఉంటాయి. ముఖం, గడ్డం భాగానికి పూర్తి రక్షణ ఇస్తుంది.

⦿ మోడ్యులర్ హెల్మెట్లు: ఈ హెల్మెట్లను అవసరం అయిన సమయంలో ముందు భాగం పైకి ఎత్తే అవకాశం ఉంటుంది.

⦿ ఓపెన్ ఫేస్ హెల్మెట్లు:  తక్కువ దూరాలకు, నగరంలో ప్రయాణాలకు ఈ హెల్మెట్లు అనుకూలంగా ఉంటాయి.

Read Also: స్టైలిష్ అండ్ సేఫ్టీ.. మగాళ్లు మెచ్చే బెస్ట్ హెల్మెట్స్ ఇవే!

హెల్మెట్స్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు   

⦿ సర్టిఫికేషన్: హెల్మెట్ కొనేటప్పుడు తప్పనిసరిగా ISI, ECE మార్క్ ఉండేలా చూసుకోవాలి. ఈ సర్టిఫికేషన్ ఉంటేనే సేఫ్ గా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

⦿ ఫిట్టింగ్: హెల్మెట్ ఫిట్టింగ్ అనేది తలకు కరెక్ట్‌ గా సరిపోవాలి. కదలకుండా ఉండేలా చూసుకోవాలి. మెడ నొప్పి రాకుండా తేలికైన  హెల్మెట్ ఎంచుకోవడం మంచిది.

⦿ విజర్: యువి రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్ తో పాటు క్లియర్ విజన్ ఉండాలి.

⦿ సౌకర్యం: ఈజీగా తొలిగించి, ఉతికేలా ఇన్నర్ ప్యాడింగ్ ఉండాలి.

⦿ డిజైన్: పూర్తి ప్రొటెక్షన్ కోసం ఫుల్ ఫేస్, సిటీలో తక్కువ దూరం ప్రయాణాలకు ఓపెన్ ఫేస్ హెల్మెట్లు వాడవచ్చు. హెల్మెట్ తలకు గట్టిగా ఉండాలి. అదే సమయంలో సౌకర్యంగా ఉండాలి. అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్, బ్రాండెడ్ షోరూమ్‌లలో మహిళలకు మంచి హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also: హోండా యాక్టివా To యమహా ఫాసినో.. లేడీస్ ఎక్కువగా ఇష్టపడే స్కూటర్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×