E-Paper
Advertisement

Best Petrol Scooters for Ladies: హోండా యాక్టివా To యమహా ఫాసినో.. లేడీస్ ఎక్కువగా ఇష్టపడే స్కూటర్లు ఇవే!

Best Petrol Scooters for Ladies: హోండా యాక్టివా To యమహా ఫాసినో.. లేడీస్ ఎక్కువగా ఇష్టపడే స్కూటర్లు ఇవే!
Advertisement

Best Petrol Scooter For Ladies In India: ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఉద్యోగాలకు, రోజు వారీ పనులకు స్కూటర్ల మీద వెళ్తున్నారు. చాలా మంది తేలికగా ఉండి, ఈజీగా ప్రయాణం చేసేలా ఉండే స్కూటర్లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం లేడీస్ కు అనుకూలంగా ఉండే పలు పెట్రోల్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హోండా యాక్టివా 6G, సుజుకి యాక్సెస్ 125, TVS జూపిటర్ లంటి స్కూటర్లతో పాటు, హీరో ప్లెజర్+, యమహా ఫాసినో లాంటి తేలికైన, స్టైలిష్ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. TVS స్కూటీ పెప్ ప్లస్ కూడా బాగా పాపులర్ అయ్యింది. తక్కువ బరువు, మంచి బూట్ స్పేస్, చక్కటి మైలేజ్, స్మార్ట్ కీ సిస్టమ్‌ లాంటి ఫీచర్లతో మహిళలను ఆకట్టుకునే పలు స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళలు ఎక్కువగా ఇష్టపడే స్కూటర్లు

⦿ హోండా యాక్టివా 6G: మంచి బిల్డ్ క్వాలిటీ, తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్, మంచి బూట్ స్పేస్ లాంటి ఫీచర్లతో రోజువారీ ఉపయోగానికి అనుకూలంగా ఉంటుంది.

Advertisement

⦿ సుజుకి యాక్సెస్ 125: చక్కటి ప్రయాణ అనుభవం, పవర్ ఫుల్ ఇంజిన్, మంచి సౌకర్యం, భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ లాంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

⦿ టీవీఎస్ జూపిటర్: ఈ స్కూటర్ మంచి మైలేజీని అందిస్తుంది. చక్కటి పని తీరుతో సౌకర్యవంతమైన, స్మూత్  ప్రయాణాన్ని అందిస్తుంది. పలు ట్రిమ్‌లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.

Advertisement

⦿ హీరో ప్లెజర్+: మంచి మైలేజ్, సులభమైన హ్యాండ్లింగ్‌తో తేలికగా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. డిజైన్, సరసమైన ధరలో లభిస్తుంది.

⦿ యమహా ఫాసినో 125 Fi హైబ్రిడ్: ఇది చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. తేలికైన నిర్మాణంతో నగర ప్రయాణానికి చక్కగా ఉంటుంది. హైబ్రిడ్ సాంకేతికతతో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది.

⦿ TVS స్కూటీ పెప్ ప్లస్: భారతదేశంలోని అత్యంత తేలికైన స్కూటర్లలో ఒకటి. ఇది కేవలం 93 కిలోల బరువు ఉంటుంది.  దీనిని ఉపయోగించడం చాలా ఈజీగా ఉంటుంది. కొత్త రైడర్లకు చాలా ఈజీగా ఉంటుంది.

Read Also: ఏథర్ TO ఓలా.. లేడీస్ కు సూటయ్యే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

మహిళలకు ఎలాంటి స్కూటర్లు బాగుంటాయంటే?  

⦿ బరువు: స్కూటర్లు చాలా తేలికగా ఉండాలి. పెప్ ప్లస్, ఫాసినో, ప్లెజర్+ లాంటివి తక్కువ బరువుతో ఉంటాయి. రోజువారీ నగర ట్రాఫిక్‌ కు అనుకూలంగా ఉంటాయి.

⦿ స్టోరేజ్: యాక్టివా 6G, యాక్సెస్ 125 రోజువారీ సరుకులను స్టోర్ చేసుకునేలా మంచి బూట్ స్పేస్ ఉంటుంది.

⦿ పనితీరు: 125cc సామర్థ్యం కలిగిన స్కూటర్లలో యాక్సెస్, ఫాసినో, జూపిటర్ 125 బాగుంటాయి.  అయితే 110ccలో  యాక్టివా, ప్లెజర్+ బాగుంటాయి.

మొత్తంగా తక్కువ బరువు, ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన స్కూటర్లను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో, మీ ఇంట్లోని మహిళలు ఏ స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారో చెప్పండి.

Read Also: విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×