E-Paper
Advertisement

Self Driving Cars: కరెంట్ పోయే.. రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయిన కార్లు, ఫుల్ ట్రాఫిక్ జామ్!

Self Driving Cars: కరెంట్ పోయే.. రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయిన కార్లు, ఫుల్ ట్రాఫిక్ జామ్!
Advertisement

 San Francisco Traffic Jam: తాజాగా అమెరికాలో ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. శాన్ ఫ్రాన్సిస్కోలో పవర్ అవుటేజ్ కారణంగా వేలాది కార్లు రోడ్లపై నిలిచిపోయాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంతకీ కరెంటు పోవడానికి కార్లు నిలిచిపోవడానికి కారణం ఏంటంటే..

డిసెంబర్ 20న పవర్ అవుటేజ్

డిసెంబర్ 20న సాయంత్రం శాన్ ఫ్రాన్సిస్కోలో భారీ పవర్ అవుటేజ్ సంభవించింది. సిటీలో సుమారు 1.3 లక్షల మంది కస్టమర్లను ఎఫెక్ట్ పడింది. కరెంటు లేక ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా Waymo సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు (రోబోటాక్సీలు) ఇంటర్‌ సెక్షన్లలో ఫ్రీజ్ అయ్యాయి.

కరెంటు ఎందుకు నిలిచిపోయిందంటే?

Advertisement

పసిఫిక్ గ్యాస్ & ఎలక్ట్రిక్ (PG&E) సబ్‌ స్టేషన్‌లో 8వ, మిషన్ స్ట్రీట్స్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో  పవర్ అవుటేజ్ జరిగింది. ఈ ఎఫెక్ట్ సిటీ అంతటా పడింది. నార్త్ బీచ్, రిచ్‌మండ్ డిస్ట్రిక్ట్, సన్‌సెట్, హైట్ ఆష్‌బరీ, పసిఫిక్ హైట్స్, ప్రెసిడియో సహా ఇతర ప్రాంతాల్లో పవర్ కట్ ఏర్పడింది. డిసెంబర్ 21 మధ్యాహ్నం నాటికి ఇంకా 19,000 మంది వినియోగదారులకు ఇంకా పవర్ అందలేదని అధికారులు వెల్లడించారు.

ట్రాఫిక్ ఇబ్బందులు, కార్లపై ఎఫెక్ట్ 

ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ అవ్వడంతో సాధారణ ట్రాఫిక్ గ్రిడ్‌ లాక్ అయింది. Waymo రోబో టాక్సీలు..  సుమారు 1,000 బే ఏరియాలో నిలిచిపోయాయి. డార్క్ సిగ్నల్స్‌ ను 4వే స్టాప్‌గా ట్రీట్ చేసి, చాలా సేపు రోడ్డు మీదే ఆగిపోయాయి. ఇంటర్‌ సెక్షన్లు, పెడెస్ట్రియన్ వాక్‌ వేలు, రెగ్యులర్ ట్రాఫిక్‌ను బ్లాక్ చేశాయి. చాలా ప్రాంతాల్లో Waymo కార్లు గంటల తరబడి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ యాక్సెస్ రూట్ లు బ్లాక్ అయ్యాయి. కొన్ని చోట్ల కారు ప్రమాదాలు కూడా జరిగాయి.

Advertisement

Waymo రియాక్షన్ ఇదే!   

ట్రాఫిక్ బ్లాక్ నేపథ్యంలో Waymo  కీలక నిర్ణయం తీసుకుంది. సేఫ్టీ ప్రయారిటీగా సర్వీస్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. రెండు రోజుల పాటు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మేయర్ ఆఫీస్ సంప్రదించిన తర్వాత ప్రకటించింది. టో ట్రక్స్ సహాయంతో కార్లు రిమూవ్ చేయించింది. డిసెంబర్ 21 మధ్యాహ్నం 3:30 తర్వాత సర్వీస్ నెమ్మదిగా ప్రారంభం అయ్యాయి.  Waymo కార్లు వెహికల్స్ వైర్‌ లెస్ యాక్సెస్ లేకుండా ఆపరేట్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ, అవుటేజ్ స్కేల్ కారణంగా ఎక్స్‌ టెండెడ్ స్టేషనరీ పీరియడ్స్ ఏర్పడ్డాయి.

పవర్ రెస్టోరేషన్ స్టేటస్

చాలా ప్రాంతాల్లో డిసెంబర్ 21 నాటికి విద్యుత్ సరఫరా ప్రారంభం అయ్యింది. ఇంకా 15,000-21,000 కస్టమర్లకు పవర్ అందలేదు. పూర్తి రెస్టోరేషన్ డిసెంబర్ 22 మధ్యాహ్నం 2 గంటలలోపు జరుగుతుందని PG&E వెల్లడించింది. రోడ్లపై ట్రావెల్ అవాయిడ్ చేయాలని మేయర్ డేనియల్ లూరీ సలహా ఇచ్చారు. ఇక రోడ్లపై ఆగిపోయిన కార్లకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Also: హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లపై ఊహించని డిస్కౌంట్లు, వెంటనే కొనేయండి బ్రో!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×