E-Paper
Advertisement

ఈ 7 వస్తువులు కారులో మర్చిపోతే.. స్మాష్ అంతే!

ఈ 7 వస్తువులు కారులో మర్చిపోతే.. స్మాష్ అంతే!
Advertisement

Things Never Leave In Car: ఈ 7 వస్తువులను కారులో అస్సలు పెట్టొద్దు. సమ్మర్ హీట్ కు ఈ వస్తువుల మండే స్వభావం పెరిగి అగ్ని ప్రమాదాలకు కారణమవుతాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల నిమిషాల్లోనే కారు లోపల తీవ్రమైన వేడి జనరేట్ అవుతుంది. ముఖ్యంగా గ్లాస్, ఇంజిన్ వద్ద ఈ వస్తువులను ఉంచితే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

1.ఫుడ్, డ్రింక్స్

Advertisement

సోడా క్యానన్ లు , క్యాండీ బార్‌లు లేదా ఐస్ క్రీమ్ లను కారులో ఎక్కువ సేపు ఉంచకూడదు. ఈ ఆహారాన్ని ఎక్కువ సేపు కారులో ఉంచితే అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియా త్వరగా వ్యాపిస్తుంది. కిరాణా సామాను లేదా మిగిలిపోయిన ఆహారాన్ని వేడిగా ఉన్న కారులో 2 గంటల కంటే ఎక్కువసేపు ఉంచవద్దు. ఇలా ఉంచిన ఆహారం తింటే అనారోగ్యం పాలవుతారు.

2.స్ప్రే బాటిల్స్

Advertisement

హెయిర్‌స్ప్రే, డియోడరెంట్, స్ప్రే పెయింట్ వంటి వాటిని కార్లలో ఎక్కువ సేపు ఉంచకూడదు. కారులో వేడికి స్ప్రే బాటిల్స్ లోని గ్యాస్ ఎక్స్ పాండ్ అవుతుంది. దీంతో స్ప్రే బాటిల్ ఒక్కసారిగా పగలడం లేదా పేలిపోవడం జరగవచ్చు.

3.సన్‌స్క్రీన్

సన్‌స్క్రీన్ ట్యూబ్‌ కారులో మర్చిపోతే అది దుర్వాసనకు కారణమవుతుంది. సన్‌స్క్రీన్‌ను కారులో ఎక్కువ సేవు వదిలేస్తే అధిక వేడికి దాని నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో తొందరగా పాడై దుర్వాసనను వెదజల్లుతుంది. అధిక వేడికి మూత ఓపెన్ అయి క్రీమ్ బయటకు వస్తే.. కారులో ఆ వాసన చాలా కాలం పోదు.

4. లైటర్లు

లైటర్లు చూడడానికి చిన్నవే కావచ్చు. కానీ ఎక్కువ వేడికి గురైనప్పుడు అగ్ని ప్రమాదానికి కారణమవుతాయి. లైటర్ ను కారులో మర్చిపోతే.. ఎక్కువ వేడికి ఇందులోని గ్యాస్ ఎక్స్ పాండ్ అవుతుంది. దీంతో అది పగిలిపోయి అగ్ని ప్రమాదానికి కారణమవుతుంది. ముఖ్యంగా వేసవిలో కారులో మండే స్వభావం కలిగిన వస్తువులు అస్సలు పెట్టుకోకూడదు.

5. ప్లాస్టిక్ బాటిల్స్, సన్ గ్లాసెస్

వాటర్ బాటిల్స్ కారులో ఎక్కువ సేపు ఉంచితే.. అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు. ముఖ్యంగా కారు గ్లాస్ వద్ద, సీట్లపై వాటర్ బాటిల్స్ ను అస్సలు పెట్టకూడదు. సూర్య కిరణాలు ఆ బాటిల్ పై పడి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. దీంతో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సన్ గ్లాసెస్ ను కూడా కారులో ఎక్కువ సేపు ఉండకూడదు. ఇవి మాగ్నిఫైయింగ్ గ్లాస్ గా పనిచేసి మంటలను పుట్టిస్తాయి.

6. బ్యాటరీలు

ఫోన్ పవర్ బ్యాంకులు, బ్యాటరీలను కారులో అస్సలు మర్చిపోవద్దు. అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలు లీక్ అవ్వడం లేదా పగిలిపోవడం జరగవచ్చు. వీటితో అగ్ని ప్రమాదాలు జరిగే ఛాన్స్ కూడా ఉంది.

7. ఎలక్ట్రానిక్స్

స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ ను ను కారులో మర్చిపోతే.. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రమాదానికి దారితీయవచ్చు. అధిక ఉష్ణోగ్రతల వద్ద స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించవద్దని తయారీదారులు సూచిస్తుంటారు.

Also Read: వామ్మో.. ఎండలో ఉన్న కారులో వెంటనే ఏసీ ఆన్ చేయడం ఇంత డేంజరా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×