E-Paper
Advertisement

Janasena : పవన్ పార్టీని వదలని ‘వేధింపులు!

Janasena : పవన్ పార్టీని వదలని ‘వేధింపులు!
Advertisement

జనసేన పార్టీని ‘వేధింపుల’ ఘటనలు వదలడం లేదు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు వెలుగులోకి వస్తున్నారు. కూటమిలో జనసేన కీలక భాగస్వామి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయగా.. అధిక స్థానాలు సాధించిన పార్టీల్లో తొలిస్థానం టీడీపీ, రెండో స్థానం జనసేనకు దక్కాయి. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఏపీలో సర్కారు ఏర్పాటై రెండేండ్లు గడిచాయి. ఈలోపు గత ప్రభుత్వం చేసిన మరకలను తుడిచేయడానికి కూటమి సర్కార్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నది.ఈ క్రమంలోనే పార్టీని మరింత బలోపేతం చేయడానికి జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే, ఆ పార్టీకి ఆదిలోనే ఇబ్బందులు తలెత్తున్నాయి.

నేతలకు వేధింపుల మచ్చలు..

జనసేన ఆవిర్భావంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ముందు నుంచి తనకోసం, పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పవన్ చేరదీశారు. వారికి టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సాధించింది. జనసేన 22 స్థానాల్లో తన అభ్యర్థులను గెలుచుకుంది. 100 శాతం స్ట్రైక్ రేటుతో పోటీ చేసి అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెచిచారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు..పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెటారు. దీనికితోడు మరిన్ని ఫోర్టుఫోలియాలు సైతం అప్పగగించారు.జనసేన నుంచి మరో మంత్రి నాదెంద్ల మనోహర్ సైతం ఉన్నారు. ఇదిలాఉండగా, కొందరు నేతల అత్యుత్సాహం, మహిళలతో అసభ్యకరంగా వహరించడం వంటికి పార్టీకి చెడ్డపేరు తీసుకొసతున్నాయి.

మొన్న అరవీ శ్రీధర్..

Advertisement

అన్నమయ్య తిరుపతి జిల్లా రైల్వే కొడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్ వ్యవహారం మొన్నటివరకు హాట్ టాపిక్ అయ్యింది. ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగికి పెళ్లయిందని తెలిసినా.. జనసేన ఎమ్మెల్యే ఆమెను లొంగదీసుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని మాయమాటల చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తున్నది. ఇటీవల జనసేన మరో లీడర్ సదరు బాధితురాలిని నడిరోడ్డు మీద దారుణంగా దాడికి పాల్పడ్డాడు.అనంతరం ఆమె పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సదరు నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇకపోతే ప్రస్తుతం ఆరవ శ్రీధర్ బయటకు రావడం లేదు. బాధితురాలి ఆరపణలు నిజంగా కాకపోతే ఎందుకు ఆయన మీడియాకు అసలు విషయం వెల్లడించడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమె తల్లి స్పందిస్తే సరిపోదు కదా? అంటున్నారు.

వాట్సాప్‌లో ఈ సెట్టింగ్ ఆపకపోతే మీరు దొరికేసినట్లే.. వెంటనే ఇలా చేయండి..

Advertisement

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జనసేన నాయకుడు జయప్రకాశ్ నాయుడు తనును మోసం చేశాడంటూ మరో మహిళ రోడ్డెక్కింది. ఆయన వల్ల ఆమె పడిన బాధను సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా పంచుకున్నది.జయప్రకాశ్ తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకున్నారని ఆరోపించారు. నమ్మించి అనేక రకాలుగా ఉపయోగించుకుని నట్టేటా ముంచాడని వాపోయారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సైతం బాధితురాలు ఆరోపించింది. వెంటనే బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె అటు పోలీసులను, ఇటు జనసేన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరవ శ్రీధర్ వ్యవహారం కూటమి సర్కారుకు చెడ్డ పేరు తీసుకురాగా.. మరో వేధింపుల కేసు వెలుగుచూడటంతో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఈ విషయాల్లో జోక్యం చేసుకుని మరోసారి ఇటువంటి ఘటనలు వెలుగుచూడకుండా చూడాలని జనసైనికులు కోరుతున్నారు.

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×