E-Paper
Advertisement

మీ టైర్ ఏజ్ ఎంత? సింపుల్ గా ఇలా తెలుసుకోండిలా!

మీ టైర్ ఏజ్ ఎంత? సింపుల్ గా ఇలా తెలుసుకోండిలా!
Advertisement

Hidden Danger in Old Tyres: చాలా మంది వాహన యజమానులు తరచుగా ఇంజిన్ ఆయిల్, మైలేజ్, సర్వీసింగ్ లాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. కానీ, టైర్ల విషయంలో పెద్దగా పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తారు. టైర్లు బయటకు బాగానే కనిపిస్తున్నాయనే కారణంతో అవి ఇంకా సేఫ్‌ గా ఉన్నాయని భావిస్తారు. కానీ, టైర్లకు కూడా ఓ ఏజ్ ఉంటుంది. వాటిని వాడకపోయినా నెమ్మదిగా చెడిపోతాయి. అందుకే తయారీ కంపెనీ సూచించిన టైమ్ వరకే టైర్లను వాడాలి. తరచుగా టైర్ ఏజ్ చెక్ చేయాలి. ఇంతకీ టైర్ వయసు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

టైర్ తయారీ డేట్ ఎలా తెలుసుకోవాలంటే?

టైర్లు రబ్బరుతో తయారవుతాయి. ఈ రబ్బరు సమయం గడిచేకొద్దీ గట్టిపడుతుంది. ముఖ్యంగా వేడి, లైట్, రోడ్ల పరిస్థితులు టైర్లను త్వరగా డ్యామేజ్ అయ్యేలా చేస్తాయి. టైర్ల గ్రిప్ తగ్గిపోతుంది. బ్రేక్ చాలా ఆలస్యంగా ఉంటుంది. కొన్నిసార్లు టైర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, టైర్ వయస్సును తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే, టైర్ తయారీ డేట్ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. టైర్  సైడ్‌ వాల్ మీద కోడ్ ఉంటుంది. ఈ కోడ్ DOT అనే పదంతో ప్రారంభమవుతుంది. ఆ కోడ్ చివర నాలుగు అంకెల సంఖ్య ఉంటుంది. అదే టైర్ తయారీ తేదీని సూచిస్తుంది.

Advertisement

ఒకవేళ టైర్ మీద ‘DOT XXXX 3522’ అని ఉంటే, 35 అంటే 35వ వారం, 22 అంటే 2022 సంవత్సరం. అంటే ఆ టైర్ 2022 ఆగస్టు ప్రాంతంలో తయారైంది. కొన్ని పాత టైర్లలో మూడు అంకెల కోడ్ మాత్రమే ఉంటుంది. అలా ఉంటే అది 2000కి ముందు తయారైనదని అర్థం. అలాంటి టైర్లను వెంటనే మార్చడం మంచిది.

టైర్ ఎంత ఏజ్ వరకు సేఫ్ అంటే?

టైర్ ఎంత వయస్సు అయితే సేఫ్ అనేది కూడా తెలుసుకోవాలి. 0 నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్న టైర్లు సురక్షితంగా ఉంటాయి. 3 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉన్నవాటిని వాడవచ్చు. కానీ. తరచూ తనిఖీ చేయాలి. 5 నుంచి 6 సంవత్సరాలు దాటితే మార్చడానికి సిద్ధం కావాలి. 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న టైర్లు వాడకపోవడమే మంచిది. చాలామంది స్పేర్ టైర్‌ ను క్యారీ చేయరు. కానీ, కచ్చితంగా తీసుకెళ్లాలి. దాన్ని కూడా నిబంధనల ప్రకారం ఉపయోగించాలి.

టైర్లు పాత బడుతున్నాయని ఎలా తెలుసుకోవాలి?

Advertisement

టైర్లు పాతబడుతున్నాయని తెలుసుకునేందుకు కొన్ని సంకేతాలు ఉంటాయి. టైర్ పక్క భాగంలో చిన్న పగుళ్లు కనిపించడం, రబ్బరు గట్టిపడడం, గాలి తరచూ తగ్గిపోవడం, రోడ్డుపై శబ్దం పెరగడం, గ్రిప్ తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. ట్రెడ్ బాగానే ఉన్నా కూడా టైర్ మార్చడం మంచిది. కొత్త టైర్లు కొనేటప్పుడు కూడా తయారీ తేదీని తప్పకుండా చెక్ చేయాలి. షాపులో కొత్తగా కనిపించే టైర్లు కూడా గోడౌన్ లో చాలా కాలం ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు 6 నుంచి 12 నెలలలో తయారైన టైర్లను కొనడం మంచిది.

Read Also: చేతక్ ఈవీలో క్రేజీ అప్ డేట్స్.. కొత్త మోడల్స్ వచ్చేశాయ్!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×