E-Paper
Advertisement

నాడు చేసిన పాపానికి నేడు కర్మ అనుభవిస్తున్నా – మంగ్లీ

నాడు చేసిన పాపానికి నేడు కర్మ అనుభవిస్తున్నా – మంగ్లీ
Advertisement

Mangli:జానపద సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మంగ్లీ గత కొన్ని రోజులుగా మైక్రో ఫైనాన్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఈ మైక్రో ఫైనాన్స్ కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.. బాధితులు రోడ్డెక్కుతుండడం, బాధితుల తరపున గిరిజన సంఘాల నేతలు పోరాటం చేస్తూ ఉండడంతో ఈ విషయం కాస్త హీట్ పెంచుతోంది . అయితే తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు అంటూ క్లారిటీ ఇచ్చింది మంగ్లీ. ముఖ్యంగా మంగ్లీ మైక్రో ఫైనాన్స్ బాధితులకు అన్యాయం జరిగిందని, బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని కూడా ప్రకటించింది.

దుర్మార్గుడు అని తెలియక తప్పు చేశాను..

ఇకపోతే ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో తలమునకులైన ఈమె తాజాగా తనపై పెట్టిన కేసుపై మరొకసారి స్పందించింది. ముఖ్యంగా రమావత్ మధు పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంగ్లీ పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.” దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి.. పట్టుబడితే నా బ్యాండ్ తో కలిసి ఇంటికి వెళ్లి భోజనం చేశాను.. ఆ ఒక్క పూట భోజనం చేసిన పాపానికి ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాను.. ఒకరకంగా చెప్పాలి అంటే అలాంటి వారి ఇళ్లలో భోజనం చేయడమే నేను చేసిన తప్పు. ఆ తప్పుకి ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నాను అంటూ తెలిపింది మంగ్లీ.

కర్మ అనుభవిస్తున్నాను..

Advertisement

ఇక ఇదే విషయంపై మంగ్లీ మాట్లాడుతూ..” కొంతమంది కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఏ ఆధారాలు లేకుండా తమ చుట్టూ కుట్రలు పన్నుతున్నారు. మధు చేసిన మోసాల్లో నాకు ఒక శాతం కూడా సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకు ఈ మోసంతో ఎటువంటి సంబంధం లేదు. బండి శివా పేరుని నా తమ్ముడు శివ చౌహాన్ గా ప్రచారం చేస్తున్నారు. పదేపదే అబద్దాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారు . మేము ఎక్కడికి పారిపోలేదు. చివరిగా నిజమే గెలుస్తుంది” అంటూ మంగ్లీ తెలిపింది. ఇకపోతే ఈ ఫ్రాడ్ కేసు బాధితుడు నల్గొండ జిల్లా పెద్దవూరకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే మంగ్లీ ఒక నోటు కూడా విడుదల చేసింది. మధు బాధితుడిగా అభివర్ణిస్తూ మంగ్లీ విడుదల చేసిన నోట్లో ఇలా రాసుకు వచ్చింది.

also read:నయనతార పేట్రియాట్ రిలీజ్ డేట్ లాక్.. సెన్సార్ సమస్యలు తీరినట్టేనా?

నోట్ విడుదల చేసిన మంగ్లీ..

Advertisement

మైక్రో ఫైనాన్స్ , శుభాక్షేత్ర ఇన్ఫ్రా మోసంలో బాధితులకు అన్యాయం జరిగింది. వారికి న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నాను. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. ఈ ఆర్థిక మోసంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది నాపై పనిగట్టుకుని కుట్ర పన్నుతున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు న్యాయ వ్యవస్థపై , చట్టంపై పూర్తి నమ్మకం, గౌరవం ఉంది ” అంటూ మంగ్లీ ఒక నోట్ విడుదల చేసింది . ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×