E-Paper
Advertisement

మొదట ఒక్కరితో.. ఆపై ముగ్గురితో.. భార్య సీక్రెట్ వీడియోలు చూసి తట్టుకోలేకపోయిన భర్త!

మొదట ఒక్కరితో.. ఆపై ముగ్గురితో.. భార్య సీక్రెట్ వీడియోలు చూసి తట్టుకోలేకపోయిన భర్త!
Advertisement

Hyderabad: నమ్మిన ఇల్లాలు నయ వంచనకు పాల్పడితే, ఆ వేదనను తట్టుకోవడం ఏ మగాడికైనా కష్టమే. కంటికి రెప్పలా చూసుకున్న భార్యే ముగ్గురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, ఆపై ప్రైవేట్ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చకెక్కితే.. గౌరవప్రదమైన జీవితం గడుపుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తట్టుకోలేకపోయాడు. చివరకు తన చావే ఆ సమస్యకు పరిష్కారమని భావించి హుస్సేన్ సాగర్‌లో దూకి తనువు చాలించాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ముగ్గురితో అక్రమ సంబంధాలు..

Advertisement

2018లో నంద్యాలకు చెందిన రేణుకతో సీతారాంకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదిస్తూ బాచుపల్లిలో కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా చూసుకునేవాడు సీతారాం. కానీ, సీతారాంకు తెలియకుండానే రేణుక ముగ్గురితో అక్రమ సంబంధాలు కొనసాగించింది. అందులో రమణారెడ్డి అనే వ్యక్తితో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ప్రైవేట్ వీడియోలు ఆమె జీవితాన్ని, సీతారాం ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో సీతారాం ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

19 పేజీల సూసైడ్ నోట్..

Advertisement

భార్య నిజస్వరూపం తెలిశాక, ఆ అవమానాన్ని భరించలేక ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ చదివితే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. ‘నేను ఆమెను ప్రాణంగా చూసుకున్నాను, ఏ లోటూ రాకుండా చూశాను. కానీ తను ఏడాదిన్నర కాలంలోనే ముగ్గురితో సంబంధాలు పెట్టుకుంది. తనకి ఏం తక్కువైంది? నా ప్రేమ సరిపోలేదా లేక ఆమె కోరుకునేది శృంగారమా?’ అంటూ తన ఆవేదనను ఆ లేఖలో అక్షరబద్ధం చేశాడు.

పోలీసుల విచారణ..

సీతారాం మరణం తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆ సూసైడ్ నోట్ ఆధారంగా రేణుకతో పాటు ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంలో ఉండి, అందమైన కుటుంబాన్ని కలిగిన ఓ వ్యక్తి.. భార్య చేసిన నమ్మకద్రోహం వల్ల ప్రాణాలు వదలడం విషాదకరం. తల్లి చేసిన తప్పుకు తండ్రి దూరమవ్వడంతో ఆ ఇద్దరు పసిపిల్లలు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు. డబ్బు, హోదా అన్నీ ఉన్నా.. నమ్మకం లేని చోట సంసారం ఎంతటి విపత్తుకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.

Also Read:కదంతొక్కిన అంబటి.. నా కుక్క కూడా భయపడదంటూ.. లోకేశ్‌కు మాస్ వార్నింగ్!

Related News

దృశ్యం సీన్ రిపీట్.. తల్లి, సోదరుడిని చంపేసి.. ఇంట్లో రెండు రోజులు మృతదేహాలు

బీటెక్ పట్టా ఉంది.. కానీ బతుకు భారమైంది.. మంటల్లో మాడిపోయిన యువతి కలలు!

సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఏడుగురు బ్యాంకు అధికారులు అరెస్ట్.. హైదరాబాద్‌లో సంచలనం

మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్యాంకర్, కారు

గన్నవరం దారుణం.. 18 నెలల పాపను గోడకేసి కొట్టి చంపిన తల్లి ప్రియుడు!

తాండూరులో కలకలం.. కూతురి ప్రేమను విడగొట్టేందుకు తల్లి ‘క్షుద్రపూజలు’

హయత్‌నగర్ పెట్రోల్ బంక్‌లో నయా మోసం.. 27 లీటర్ల ట్యాంక్.. 32 లీటర్ల బిల్లు.. అసలు ఏం జరుగుతోంది?

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన టీనేజ్ యువతి, ఫ్రిజ్‌లో మృతదేహం, ఎందుకో తెలిస్తే షాకవుతారు

Big Stories

Advertisement
×