E-Paper
Advertisement

స్కోడా ఎపిక్ ఈవీ లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

స్కోడా ఎపిక్ ఈవీ లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Skoda Epic EV Unveiling on May 19: స్కోడా ఆటో త్వరలో కొత్త ఎలక్ట్రిక్ SUV ఎపిక్‌ ను విడుదల చేయబోతోంది. మే 19న ఈ వెహికల్ అధికారికంగా లాంచ్ కానుంది. స్కోడా లైన్‌ అప్‌ లో ఈ కారు అతి చిన్న ఎలక్ట్రిక్ SUVగా ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న ఎల్రోక్ మోడల్ కంటే దిగువన ఈ ఎపిక్ ఉంటుంది. భవిష్యత్తులో కంపెనీ తీసుకురాబోయే ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఈ మోడల్ కీలక పాత్ర పోషించే అవకాశముంది.

ఎపిక్ ఈవీ.. వోక్స్‌ వ్యాగన్ గ్రూప్ అభివృద్ధి చేసిన MEB+ ప్లాట్‌ ఫారమ్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ ఫారమ్‌ ను వోక్స్‌ వ్యాగన్ ఐడి పోలో లాంటి మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ ఫారమ్ ప్రత్యేకంగా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించబడింది. దీని వల్ల వెహికల్ తక్కువ స్థలంలోనే మెరుగైన పనితీరు, మంచి ప్యాకేజింగ్,  ఆధునిక టెక్నాలజీ ఫీచర్లను అందించేలా ఉంటుంది.

సింపుల్, క్లీన్ ఇంటీరియర్ 

ఇంటీరియర్ విషయానికి వస్తే, స్కోడా చాలా సింపుల్, క్లీన్ గా కనిపించే డిజైన్‌ను ఎంచుకుంది. క్యాబిన్‌ లో పెద్ద సెంట్రల్ టచ్‌ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. డ్రైవర్ కోసం చిన్న డిజిటల్ డిస్‌ ప్లే కూడా ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్ కోసం పూర్తిగా టచ్ ఆధారిత వ్యవస్థ కాకుండా ఫిజికల్ బటన్లను కూడా ఇచ్చే అవకాశముంది. వీటిని డ్రైవింగ్ సమయంలో ఉపయోగించడం సులభంగా ఉంటుంది. వైర్‌ లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చోవడానికి తగినంత స్థలం ఉండేలా క్యాబిన్ డిజైన్ చేశారు. బూట్ స్పేస్ సుమారు 475 లీటర్లుగా ఉండటం వల్ల సుదూర ప్రయాణాల్లో లగేజీని తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది.

డిజైన్ గురించి..

డిజైన్ లో కూడా స్కోడా క్రేజీగా ఆలోచించింది. ముందు భాగంలో టెక్ డెక్  ఫేస్ కనిపిస్తుంది. దీనితో పాటు T ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. ఇవే ఇండికేటర్లుగా కూడా పని చేస్తాయి. కారు పొడవు సుమారు 4.1 మీటర్ల వరకు ఉంటుంది. దీనివల్ల ఇది కాంపాక్ట్ SUV విభాగంలోకి వస్తుంది. సైడ్ ప్రొఫైల్‌ లో బ్లాక్ క్లాడింగ్, రూఫ్ రైల్స్ లాంటి అంశాలు కనిపిస్తాయి. వెనుక భాగంలో T-ఆకారపు టెయిల్ ల్యాంప్‌లు, రూఫ్ స్పాయిలర్ ఉండటం వల్ల స్పోర్టీ లుక్ ఇస్తుంది.

ఒకే ఛార్జ్ తో 425 కి.మీ రేంజ్

స్కోడా ఎపిక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 425 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. పూర్తి టెక్నికల్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. వోక్స్‌ వ్యాగన్ ఐడి సిరీస్‌ లో ఉన్న మోడళ్ల మాదిరిగానే, దీనిలో కూడా రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉంటాయి. సుమారు 34 kWh, 54 kWh సామర్థ్యాలతో ఉండొచ్చని అంచనా. ఈ మోడల్ ఇక్కడ విడుదల అవుతుందా? లేదా? అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. కానీ, భారతదేశంలో ఎలక్ట్రిక్ SUVలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ విడుదల చేసే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ విడుదల అయితే, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE 6, మారుతి ఇ-విటారా, టాటా కర్వ్ EV లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Read Also: టాటా కర్వ్ ఈవీ vs హ్యుందాయ్ క్రెటా ఈవీ.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ SUV?

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×