E-Paper
Advertisement

గ్రామ పంచాయతీలో లిక్కర్ నహీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్‌..!

గ్రామ పంచాయతీలో లిక్కర్ నహీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్‌..!
Advertisement

Belt Shops: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపుల నిర్మూలనకు తీసుకున్న చర్యలపై రూపొందించిన పోస్టర్ ప్రస్తుతం వాట్సప్ సహా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈనెల15 నుంచి బెల్ట్ షాపులు బంద్ అనే సందేశంతో రూపొందించిన ఈ ప్రచార చిత్రం ప్రజల్లో చైతన్యం రేకెత్తిస్తోంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామంలో బెల్ట్ షాపులు పూర్తిగా మూసివేయాలని ప్రకటించారు. ముందుగా 14 రోజుల గడువు ఇచ్చి వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని సూచించారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోస్టర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..

నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నారు. గ్రామాన్ని మద్యపానం రహితంగా మార్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇందులో “Say No to Alcohol” అనే సందేశంతో పాటు మద్యం వ్యతిరేక చిహ్నాలు ఆకట్టుకుంటున్నాయి. గ్రామస్థుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.

Advertisement

Also Read: హైదరాబాద్ పోలీసుల ఆక్టోపస్ 2.0 దెబ్బ.. 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్..!

యువతలో జోష్.. స్టేటస్‌లలో సందేశం

ఈ పోస్టర్ ప్రభావంతో గ్రామంలోని యువత ముందుకు వచ్చారు. బెల్ట్ షాపుల నిషేధానికి మద్దతుగా యువకులు తమ వాట్సప్ స్టేటస్‌లలో ఈ పోస్టర్‌ను పెట్టుకోవడం విశేషం. మా గ్రామం మద్యం రహితం కావాలి Say No to Alcohol వంటి నినాదాలతో స్టేటస్‌లు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఈ ప్రచారం మరింత వేగంగా ప్రజల్లోకి చేరుతోంది.

ప్రజల అభిప్రాయం ఇదే..

Advertisement

బెల్ట్ షాపులు మూసివేస్తే కుటుంబాలు కాపాడబడతాయి అని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, కమలాపూర్ గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుండగా, యువత చొరవ ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోంది.

Also read: గద్వాల జిల్లాకు రెండు నామినేటెడ్ పదవులు భర్తీ!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×