E-Paper
Advertisement

స్కోడా నుంచి ఎంట్రీ లెవల్ ఈవీ లాంచ్.. రేంజ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

స్కోడా నుంచి ఎంట్రీ లెవల్ ఈవీ లాంచ్.. రేంజ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

New Skoda Epiq EV Unveiled: స్కోడా తన కొత్త ఎలక్ట్రిక్ SUV ఎపిక్ ను అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పటి వరకు విడుదల చేసిన EVలలో అత్యంత చిన్నది. అంతేకాదు, అత్యంత సరసమైన ధరలో రానున్న మోడల్‌ గా నిలుస్తోంది. రెండు సంవత్సరాల క్రితం కాన్సెప్ట్ రూపంలో పరిచయం చేసిన ఈ కారును ఇప్పుడు ప్రొడక్షన్ రెడీ వెర్షన్‌ గా తీసుకొచ్చింది. ప్రపంచ మార్కెట్‌ లో ఈ కారు స్కోడా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది.

 మోడరన్ సాలిడ్ డిజైన్ స్టైల్‌

కొత్త ఎపిక్ SUVలో స్కోడా మోడరన్ సాలిడ్ డిజైన్ స్టైల్‌ ను ఉపయోగించింది. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్, సన్నని LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఆకట్టుకునే హెడ్‌ ల్యాంప్ డిజైన్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. బంపర్‌ పై సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా ఉంది. సైడ్ ప్రొఫైల్‌ లో స్టైలిష్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ రైల్స్,  రూఫ్‌ లైన్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో T-షేప్ LED టెయిల్ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం డిజైన్ చూస్తే ఇది చిన్న SUV అయినప్పటికీ అత్యాధునిక స్పోర్టీ లుక్ లో కనిపిస్తుంది.

Advertisement

కొలతల విషయానికి వస్తే, ఎపిక్ పొడవు 4,171mm కాగా, వీల్‌ బేస్ 2,601mm ఉంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ లోపల మంచి స్థలం ఉండేలా డిజైన్ చేశారు. ఈ SUVకి తక్కువ డ్రాగ్ కోఎఫిషియెంట్ ఉండటం వల్ల గాలి నిరోధం తగ్గి, ఎక్కువ రేంజ్ లభిస్తుంది.

అత్యాధునిక ఫీచర్లు

క్యాబిన్‌ లో కూడా స్కోడా ఆధునిక ఫీచర్లను అందించింది. ఇందులో 13 అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, చిన్న డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, రెండు స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. క్యాబిన్‌ లో యాంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. స్టోరేజ్ కోసం ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌ను అందించారు. ఫీచర్ల పరంగా చూస్తే, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 10 స్పీకర్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ADAS సేఫ్టీ టెక్నాలజీ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 7 ఎయిర్‌ బ్యాగ్‌లు కూడా అందిస్తున్నారు. బూట్ స్పేస్ 475 లీటర్లుగా ఉండగా, ముందు భాగంలో 25 లీటర్ల ఫ్రంక్ కూడా ఉంది.

ఎపిక్ బ్యాటరీ ఆప్షన్స్ గురించి..

Advertisement

స్కోడా ఎపిక్ రెండు బ్యాటరీ ఆప్షన్లలో రానుంది. ఒకటి 38.5kWh బ్యాటరీ కాగా, మరొకటి 55kWh బ్యాటరీ. ఇవి ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ తో పని చేస్తాయి. 38.5kWh బ్యాటరీ వేరియంట్లు 116hp, 135hp పవర్‌ ను అందిస్తాయి. టాప్ మోడల్ 55kWh బ్యాటరీతో 211hp పవర్, 290Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చిన్న బ్యాటరీతో సుమారు 310 కిలోమీటర్లు, పెద్ద బ్యాటరీతో 440 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 55kWh బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు కేవలం 24 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని స్కోడా తెలిపింది. స్కోడా ఎపిక్ చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మంచి రేంజ్‌ తో మార్కెట్లో మంచి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

Read Also: నెక్సాన్ To హైరైడర్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాప్ కార్లు ఇవే!

Related News

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

Big Stories

Advertisement
×