E-Paper
Advertisement

మా ఇల్లే కదా.. నన్ను ఎవరు చూడరు అని అలా చేస్తున్నారా.. అయితే మీ పని ఖతం..?

మా ఇల్లే కదా.. నన్ను ఎవరు చూడరు అని అలా చేస్తున్నారా.. అయితే మీ పని ఖతం..?
Advertisement

Illegal Water Motors: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతుంది. సరఫరా జరిగే రోజున ఎక్కువ నీటిని తోడుకునేందుకు యజమానులు నల్లాలకు మోటార్లను బిగిస్తే ఇప్పటి వరకు వాటిని స్వాధీనం చేసుకున్న జలమండలి, ఇపుడు కఠిన చర్యలకు సిద్దమైంది. నల్లాలకు మోటారు బిగించే వారిని గుర్తించి, మోటార్లను స్వాధీనం చేసుకోవటంతో పాటు మోటార్లను భిగించిన వారికి రూ. 5 వేలను జరిమానాగా విధిస్తుంది. ఇలాగే పదేపదే చేస్తే కఠిన చర్యలు కూడా తీసుకోక తప్పదని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు.

12 మోటార్లను స్వాధీనం..

మంగళవారం ఉప్పల్ జోన్, డివిజన్- 4, బోడుప్పల్ వార్డులో ఉన్న శ్రీలక్ష్మీ నగర్ కాలనీ, ప్రశాంత్ గర్ పరిధిలో నల్లాకు బిగించిన మోటార్లును విజిలెన్సు అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి 12 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తామని, రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Also Read: బీఆర్ఎస్ కారులో మళ్లీ పాత డ్రైవర్లే.. గుస్సా అవుతున్న కార్యకర్తలు

కస్టమర్ కేర్ నెంబర్..

ఒకవేళ తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అయితే, నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తితే తమకు దగ్గరలోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలని, లేక జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా షురూ.. దర్శకుడిగా కంఠంనేని రవిశంకర్!

Related News

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

Big Stories

Advertisement
×