E-Paper
Advertisement

నెక్సాన్ To హైరైడర్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాప్ కార్లు ఇవే!

నెక్సాన్ To హైరైడర్..  ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాప్ కార్లు ఇవే!
Advertisement

Trending Cars in India May 2026: భారత కార్ల మార్కెట్‌ లో ఈ మధ్య కొత్త మోడళ్లపై భారీ ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ప్రీమియం ఎస్‌యూవీలు కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆటో కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీ, ఆధునిక డిజైన్, మెరుగైన ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న, ఇప్పటికే ట్రెండింగ్‌ లో ఉన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి బ్రెజ్జా 2026

కారు లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మోడళ్లలో మారుతి సుజుకి బ్రెజ్జా 2026 ఒకటి. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో బ్రెజ్జా ముందుంటుంది. కొత్త వెర్షన్‌ లో స్టైలిష్ డిజైన్, అప్‌ డే టెడ్ ఇంటీరియర్, కొత్త టెక్నాలజీ ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.8.50 లక్షలుగా ఉండొచ్చని తెలుస్తోంది.

⦿ హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్

Advertisement

ఈ కారు కూడా మార్కెట్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. సెడాన్ కార్లలో హోండా సిటీకి మంచి పేరు ఉంది. ఈ కొత్త ఫేస్‌ లిఫ్ట్‌ లో చిన్న డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండొచ్చని భావిస్తున్నారు. దీని ధర సుమారు రూ.12.50 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా

ఈవీ విభాగంలో టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. టయోటా నుంచి రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై వినియోగదారుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పొల్యూష్ ఫ్రీ డ్రైవింగ్‌ తో పాటు టయోటా బ్రాండ్ నమ్మకాన్ని అందించనున్న ఈ కారు ధర రూ.18 లక్షల నుంచి రూ.21 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం.

⦿ ఎంజీ మ్యాజెస్టర్

Advertisement

ప్రీమియం సెగ్మెంట్‌ లో ఎంజీ మ్యాజెస్టర్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. లగ్జరీ ఫీచర్లు, పవర్‌ఫుల్ పనితీరు, పెద్ద ఎస్‌యూవీ డిజైన్‌ తో ఈ మోడల్ మార్కెట్లోకి రానుంది. దీని ధర సుమారు రూ.39.50 లక్షల నుంచి రూ.43.25 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

⦿ BMW M440i

లగ్జరీ కార్ల అభిమానులు ఆసక్తిగా చూస్తున్న మరో మోడల్ BMW M440i. ఇది హై పర్ఫార్మెన్స్ కన్వర్టిబుల్ కారు. 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ సాఫ్ట్ టాప్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ కారు రానుంది. దీని ధర సుమారు రూ.1.10 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం.

⦿ వోక్స్‌ వ్యాగన్ టైగన్

ఇక ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా ట్రెండింగ్‌లో ఉన్న కార్లలో వోక్స్‌ వ్యాగన్ టైగన్ ఒకటి. మంచి డిజైన్, సేఫ్టీ ఫీచర్లు, డ్రైవింగ్ అనుభవంతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధర రూ.11 లక్షలుగా ఉంది.

⦿ టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ కూడా తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నెక్సాన్‌ కు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్, ఈవీ వెర్షన్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.7.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

⦿ మహీంద్రా XUV 7XO

పెద్ద ఎస్‌యూవీ కోరుకునే వారికి మహీంద్రా XUV 7XO మంచి ఎంపికగా మారింది. విశాలమైన కేబిన్, పవర్‌ ఫుల్ ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో ఈ మోడల్ మంచి ఆదరణ పొందుతోంది. దీని ధర రూ.13.66 లక్షల నుంచి రూ.24.92 లక్షల వరకు ఉంటుంది

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్

హైబ్రిడ్ కార్లలో ఈ కారు మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెరుగైన మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇది ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది.

Read Also: 6.6 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. స్పోర్టీ లుక్‌ లో మినీ కూపర్ కొత్త ఎడిషన్ అదిరింది!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×