E-Paper
Advertisement

Skoda Price Hike: స్కోడా లవర్స్ కు షాక్, ఆ కారు ధర ఏకంగా రూ. 33 వేలు పెంపు!

Skoda Price Hike:  స్కోడా లవర్స్ కు షాక్, ఆ కారు ధర ఏకంగా రూ. 33 వేలు పెంపు!
Advertisement

Skoda Slavia Price Increase:  చాలా ఆటో మోబైల్ కంపెనీలు 2025 డిసెంబర్ లోనే తమ కార్ల ధరలను పెంచాయి. పెంచిన ధరలను జనవరి 1, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చాయి. అయితే, స్కోడా గత ఏడాది ధరలను సవరించలేదు. తాజాగా ధరల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. స్కోడా ఆటో ఇండియా జనవరి ఎండింగ్ లో తన కంపెనీకి చెందిన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా స్లావియా సెడాన్ మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఇంతకీ స్కోడా ఏ కారుపై ఎంత ధరను పెంచింది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

స్కోడా ధరల పెంపు ఎలా ఉందంటే?

తాజాగా తెలిసిన వివరాల ప్రకారం స్లావియా మోంటే కార్లో 1.0 AT, 1.5 DSG వేరియంట్ల ధరలు వరుసగా రూ. 33,690, 29,207 వరకు పెరిగాయి. ఆ తర్వాత స్థానంలో ప్రెస్టీజ్ 1.0 AT, స్పోర్ట్‌ లైన్ 1.5 DSG ఉన్నాయి. ఈ రెండింటి ధరలు వరుసగా రూ. 27,690, రూ. 25,897 పెరిగాయి.

Advertisement

స్కోడా స్లావియా ప్రెస్టీజ్ 1.5 DSG వేరియంట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఇకపై రూ. 23,207 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో  సిగ్నేచర్ 1.0, స్పోర్ట్‌ లైన్ 1.0 (MT, AT) ధరలు రూ. 16,586 వరకు హైక్ అయ్యాయి. ఎంట్రీ-లెవల్ క్లాసివ్ 1.0 MTతో సహా అన్ని ఇతర వేరియంట్‌ల ధరల విషయంలో కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వాటి ధరలు అలాగే ఉంటాయని వెల్లడించింది.

ప్రస్తుతం స్కోడా స్లావియా ధర ఎంత అంటే?

ధర పెంపు తర్వాత స్లావియా ధర ఇప్పుడు రూ. 10 లక్షల నుంచి రూ. 17.99 లక్షల మధ్య ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే. ఆన్ రోడ్ విషయానికి వస్తే మరికాస్త ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు వీటికి యాడవుతాయి. ఈ మోడల్ 1.0, 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌ తో ఆరు స్పీడ్ మాన్యువల్, ఏడు స్పీడ్ DSG,  ఆరు స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ లతో జత చేయబడింది.

Advertisement

Read Also: MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!

అటు  స్కోడా స్లావియా సెడాన్ ఫేస్‌ లిఫ్ట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ పని చేస్తుంది. ఇది ఈ సంవత్సరం చివర్లో విడుదల చేసేలా ప్రణాళికలు వేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడది నవంబర్ లేదంటే డిసెంబర్ లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఫేస్ లిఫ్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also:  హ్యుందాయ్ నుంచి దుమ్మురేపే కారు, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×