E-Paper
Advertisement

Flip-Back Helmet: 180° రొటేటింగ్ చిన్ బార్ తో SMK హెల్మెట్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

Flip-Back Helmet: 180° రొటేటింగ్ చిన్ బార్ తో SMK హెల్మెట్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?
Advertisement

SMK Cygnus Flip-Back Helmet: హెల్మెట్ల తయారీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ SMK. Studds ప్రీమియం బ్రాండ్ నుంచి మరో అత్యాధునిక ఫ్లిప్ బ్యాక్ హెల్మెట్ లాంచ్ అయ్యింది. ఈ హెల్మెట్ 180° రొటేటింగ్ చిన్ బార్తో వస్తుంది. ఫుల్ ఫేస్ మోడ్ నుంచి ఓపెన్ ఫేస్ మోడ్‌ కు సులభంగా మార్చుకునే అవకాశం ఉంది. దేశీ మార్కెట్లోకి ఇవాళ అధికారికంగా లాంచ్ అయ్యింది. India Bike Week (IBW) 2025లో దీనిని ఆవిష్కరించారు.ఇది టూరింగ్, కమ్యూటింగ్, వెర్సటైల్ రైడింగ్‌ కు బెస్ట్ గా సూట్ అవుతుంది.SMK ఇండియా బైక్ వీక్ 2025లో కొత్త హెల్మెట్‌లు, రైడింగ్ గేర్‌లను ప్రదర్శించింది.

ఇండియాలో SMK హెల్మెట్ అంచనా ధర  

భారతీయ మార్కెట్ లో SMK హెల్మెట్ అంచనా ధర  రూ. 17,000 నుంచి రూ. 20,000 మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. అయితే, పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేదు. మరికొద్ది నెలల్లోనే ఈ హెల్మెట్ అందుబాటులోకి రానుంది.

SMK హెల్మెట్ కలర్స్, వేరియంట్స్

Advertisement

SMK హెల్మెట్ 4 నుంచి 5 కలర్స్ లో రానున్నాయి. Gloss Black, White, Metallic Grey, Nardo Grey సహా మరికొన్ని రంగుల్లో రానుంది. సైజెస్  విషయానికి వస్తే, XS నుంచి XXXL వరకు రానున్నాయి. బెటర్ ఫిట్ కోసం 2 షెల్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

కీ ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

డబుల్ P/J హోమోలగేషన్, ఫుల్ ఫేస్, ఓపెన్ ఫేస్ రెండింటికీ సేఫ్టీ స్టాండర్డ్స్ లో పాస్ అయ్యింది. ఇండియాలో ఇలాంటి ఫీచర్లు ఉన్న ఏకైక హెల్మెట్ ఇదే. ECE, DOT స్టాండర్డ్స్ తో రూపొందింది.  EIRT షెల్ మెటీరియల్ తో రూపొందింది.  ఇన్నర్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే మల్టీ డెన్సిటీ EPS లైనర్, బెటర్ ఇంపాక్ట్ అబ్జార్ప్షన్ ను కలిగి ఉంది. వైడ్ ఆంటీ స్క్రాచ్ విజర్,  ఆంటీ-ఫాగ్, ఇంటర్నల్ రిట్రాక్టబుల్ సన్ విజర్ ను కలిగి ఉటంఉంది. వెంటిలేషన్ విషయానికి వస్తే అడ్వాన్స్‌డ్ ఎయిర్‌ ఫ్లో చానల్స్ ద్వారా బెటర్ కూలింగ్ లభిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే రిమూవబుల్,  వాషబుల్ హైపోఅలర్జెనిక్ లైనర్, స్పీకర్ పాకెట్స్, బ్లూటూత్ హెడ్‌ సెట్ సపోర్ట్ తో వస్తుంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఎమర్జెన్సీ క్విక్ రిలీజ్ సిస్టమ్(చీక్ ప్యాడ్స్), ఫుల్ మెటల్ మైక్రోమెట్రిక్ బకుల్ తో వస్తుంది. బ్రీత్ డిఫ్లెక్టర్, విండ్ డిఫ్లెక్టర్, హైపోఅలర్జెనిక్ ఫాబ్రిక్తో తయారైంది.

Advertisement

Read Also: అపాచి RTXకు అరుదైన గుర్తింపు, ప్రతిష్టాత్మక IMOTY అవార్డు 2026 కైవసం!

SMK హెల్మెట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు

వెర్సటైల్ డిజైన్ (ఫుల్/ఓపెన్ మోడ్స్ మధ్య స్విచ్), ప్రీమియం సేఫ్టీ,  కంఫర్ట్ (టూరింగ్‌కు ఐడియల్), మోడర్న్ స్టైల్, అడ్వాన్స్‌డ్ వెంటిలేషన్, బ్లూటూత్ రెడీ లాంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ అద్భుతమైన హెల్మెట్ మరికొదంది నెలల్లో SMK రిటైల్ నెట్‌ వర్క్ (Studds డీలర్స్) ద్వారా అందుబాటులోకి వస్తుంది.

Read Also: దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ SUV ఇదే, ధర ఎంతో తెలుసా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×