E-Paper
Advertisement

TVS Apache RTX Wins Award: అపాచి RTXకు అరుదైన గుర్తింపు, ప్రతిష్టాత్మక IMOTY అవార్డు 2026 కైవసం!

TVS Apache RTX Wins Award: అపాచి RTXకు అరుదైన గుర్తింపు, ప్రతిష్టాత్మక IMOTY అవార్డు 2026 కైవసం!
Advertisement

TVS Apache RTX  IMOTY 2026 Award: ప్రముఖ టూవీలర్ సంస్థ TVSకు సంబంధించిన Apache RTX ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ (IMOTY) 2026 విజేతగా నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన జ్యూరీ అన్ని అంశాలను పరిశీలించి ఇచ్చిన పాయింట్స్ ఆధారంగా ఈ బైక్ టాప్ లో నిలిచింది. తుది పోటీ కోసం షార్ట్‌ లిస్ట్ చేయబడిన ఎనిమిది మోటార్‌ సైకిళ్లలో TVS Apache RTX ఒకటి. పైనల్ లిస్టులో ప్లేస్ దక్కించుకున్న స్పోర్టీ కమ్యూటర్లు, మోడ్రన్ క్లాసిక్స్, అడ్వెంచర్ మోటార్‌ సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైక్‌ తో సహా విస్తృత శ్రేణి విభాగాలకు ప్రాతినిధ్యం వహించాయి.

TVS Apache RTX డిజైన్, నాణ్యత, ఫీచర్లు, మొత్తం రైడ్ ఎక్స్ పీరియెన్స్ కు ప్రత్యేకంగా నిలిచింది. దీనికి తోడు, బైక్ ధర కూడా కొనుగోలు దారులకు అనుగుణంగా ఉంది. IMOTY జ్యూరీ  మోటార్‌ సైకిల్‌ డిజైన్, ఇంజనీరింగ్, పనితీరు, సాంకేతికత, ప్రాక్టికాలిటీ లాంటి వివరాలను పరిశీలించి పాయింట్స్ ఇచ్చారు. వీటి ఆధారంగా Apache RTX, IMOTY 2026 అవార్డును దక్కించుకుంది.

TVS Apache RTX బైక్ గురించి..

Advertisement

TVS మోటార్ కంపెనీ నుంచి వచ్చిన మొదటి అడ్వెంచర్ టూరర్ మోటార్‌ సైకిల్ ఇది. ఇది Apache సిరీస్‌లో భాగంగా విడుదల అయ్యింది. 310cc ప్లాట్‌ ఫాం ఆధారంగా రెడీ అయ్యింది. దేశీ మార్కెట్ లోకి అక్టోబర్ 15న లాంచ్ అయ్యింది. నవంబర్ 28 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇది ఆఫ్ రోడ్, లాంగ్ డిస్టెన్స్ టూరింగ్, సిటీ రైడింగ్‌కు సరిపోతుంది. బిగినర్ ఫ్రెండ్లీ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, మల్టీ లెవల్ ఫీచర్లతో వస్తుంది.

TVS Apache RTX బైక్  ధర

బేస్ వేరియంట్: రూ.1,99,000, టాప్ వేరియంట్: రూ.2,14,000గా ఉంటుంది. ఆన్ రోడ్ ధరలు నగరాన్ని బట్టి రూ. 2.2 లక్షల నుంచి రూ.2.6 లక్షల వరకు ఉంటుంది. లైట్నింగ్ బ్లాక్ (Lightning Black), పెర్ల్ వైట్ (Pearl White), మెటాలిక్ బ్లూ (Metallic Blue), టార్న్ బ్రాంజ్ (Tarn Bronze), వైపర్ గ్రీన్ (Viper Green) – BTO ఎక్స్‌క్లూసివ్,  అనివర్సరీ స్పెషల్  బ్లాక్గో ల్డ్ లివరీ కూడా అందుబాటులో ఉంది.

TVS Apache RTX ఇంజిన్, పర్ఫార్మెన్స్, కీ ఫీచర్లు

Advertisement

299.1 cc లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్ (RT-XD4 ప్లాట్‌ఫామ్), 6 స్పీడ్ గేర్‌ బాక్స్ విత్ క్విక్‌ షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్, మైలేజ్  30-35 kmpl ఇస్తుంది. టాప్ స్పీడ్ 140+ kmph ఉంటుంది. 5-ఇంచ్ TFT డిస్‌ప్లే విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, 4 రైడ్ మోడ్స్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, USD ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ రియర్, ఫ్యూయల్ ట్యాంక్ 12.5 లీటర్స్, వెయిట్ 180 కేజీలు ఉంటుంది. KTM 250 Adventure, Royal Enfield Himalayan 450, Suzuki V-Strom SX బైక్ లకు గట్టి పోటీ ఇస్తుంది.

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×