Nandamuri Balakrishna: పుట్టపర్తిలోని చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామం ఎస్సీ శ్మశాన వాటిక ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. శ్మశాన వాటిక లేక దళితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు ఉన్న శ్మశానంలోకి వెళ్లాలని చూస్తే చుట్టూ ఉన్న రైతులు దారి మూసేయడంతో వారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలు కూడా సరిగా చేయలేని దుస్థితి నెలకొంది.
శ్మశానానికి దారి చూపాలని కాలనీ వాసులు పాదయాత్ర చేపట్టారు.గత నవంబర్లో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి తమ సమస్యను పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీవాసులతో ఆయన నేరుగా ఫోన్లో మాట్లాడారు. మూడు రోజుల్లో వ్యక్తిగతంగా సమస్యను పరిష్కరిస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ ఎస్సీ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. కాగా గతంలో కాలనీ వాసులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా వారి సమస్యకు పరిష్కారం దొరకలేదు.
ఎస్సీలకు ప్రత్యేకంగా శ్మశానవాటిక కేటాయిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని భావించిన దళితులు దేమకేతేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు ఇటీవల పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు. గత నవంబర్లో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేమకేతేపల్లి, చిలమత్తూరు, కొడికొండ, కోడూరుతోపు, శెట్టిపల్లి, బూదిలి, గుమ్మయ్యగారిపల్లి, పెడపల్లి, జగరాజుపల్లి మీదుగా 51 కిలోమీటర్ల దూరం వారు పాదయాత్ర చెపట్టారు. ఆదివారం మామిళ్లకుంట క్రాస్‌కు చేరుకుంది. పాదయాత్ర బృందంలోని దళితులు అక్కడి కమ్యూనిటీ భవనంలో బస చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, సమస్య గురించి విన్నవిస్తామని అధికారులు చెబుతూ వస్తున్నారని వారు మీడియాతో పేర్కొన్నారు.
Also Read: Anchor Sravanthi: యాంకర్ స్రవంతి చెప్పుల ధర రూ.85 వేలా? అంత ప్రత్యేకత ఏమిటీ?
కొర్లకుంట ఎస్సీ శ్మశానవాటిక ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ఎస్సీ కాలనీవాసులతో నేరుగా ఫోన్లో మాట్లాడిన బాలయ్య
మూడు రోజుల్లో వ్యక్తిగతంగా సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ
ఆందోళన చెందొద్దు అంటూ భరోసా pic.twitter.com/oiSwTcAnRl
— BIG TV Breaking News (@bigtvtelugu) December 20, 2025