E-Paper
Advertisement

Sunroof vs Moonroof car: సన్‌రూఫ్ vs మూన్‌రూఫ్.. రెండింటి మధ్య తేడాలేంటి? ఏది బెస్ట్?

Sunroof vs Moonroof  car:  సన్‌రూఫ్ vs మూన్‌రూఫ్.. రెండింటి మధ్య తేడాలేంటి? ఏది బెస్ట్?
Advertisement

Sunroof vs Moonroof Comparison: కార్లకు సంబంధించిన ఫీచర్లలో అత్యంత ముఖ్యమైనవి సన్‌రూఫ్, మూన్‌రూఫ్. వాస్తవానికి చాలా మంది కారు కొనుగోలు చేసే సమయంలో సన్‌రూఫ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. అయితే, మూన్‌రూఫ్ కూడా ఉంటుందని చాలా మందికి తెలియదు. నిజానికి రెండూ కారు పైకప్పులో ఉండే ప్యానెల్స్. ఇవి కాంతి, గాలిని లోపలికి రానిస్తాయి. కానీ, రెండింటి మధ్య చాలా లేడాలు ఉన్నాయి. సన్‌ రూఫ్‌లు సాధారణంగా మెటల్‌తో తయారవుతాయి. తెరవగలిగేలా ఉంటాయి.  అయితే మూన్‌ రూఫ్‌లు బిగించబడి ఉన్న గ్లాస్ తో ఉంటాయి. మూసి ఉంచినా కాంతి లోపలికి పడేలా చేస్తాయి. ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడాలేంటి? ఏది ఎలా ఉపయోగపడుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సన్‌రూఫ్ vs మూన్‌రూఫ్ మధ్య తేడాలు   

⦿ ప్యానెల్ తయారయ్యే మేటీరియల్: సన్‌ రూఫ్ పారదర్శకత లేని  మెటల్‌ తో తయారవుతుంది. కారు రంగులోనే ఉంటుంది. మూన్‌ రూఫ్ అనేది పారదర్శకమైన లేదంటే కలర్ గ్లాస్ తో తయారు చేస్తారు.

Advertisement

⦿ పారదర్శకత: మూన్‌ రూఫ్‌లు మూసి ఉంచినప్పుడు కూడా వెలుతురును లోపలికి రానిస్తాయి. కానీ, సన్‌ రూఫ్‌ లు ఓపెన్ చేస్తేనే లైట్, ఎయిర్ లోపలికి వస్తుంది.

⦿ ఓపెనింగ్: సన్‌ రూఫ్‌ లు సాధారణంగా పూర్తిగా ఓపెన్ అవుతాయి. ఒక్కోసారి వెనక్కి జరిపేలా ఉంటాయి. మూన్‌ రూఫ్‌ లు సాధారణంగా స్లైడ్ లేదంటే టిల్ట్ అవుతాయి. కానీ, పూర్తిగా తొలగించే అవకాశం ఉండదు.

Advertisement

⦿ ఇంటీరియర్ కవర్: మూన్‌ రూఫ్‌ లకు లోపలి వైపు స్లైడింగ్ ప్యానెల్ ఉంటుంది. సన్‌ రూఫ్‌ లలో ఇది ఉండదు.

⦿ లేటెస్ట్ కార్లలో:  ప్రస్తుతం మార్కెట్ లోకి వచ్చే కార్లలో మూన్‌ రూఫ్‌లు, ముఖ్యంగా పెద్దవిగా ఉండే పనోరమిక్ మూన్‌ రూఫ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

⦿ పనోరమిక్ సన్‌ రూఫ్: ఇది కారు పైకప్పులో చాలా భాగం కవర్ చేస్తూ, వెనుక సీటు ప్రయాణికులకు కూడా ఆకాశాన్ని చూసేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే లోపల విశాలమైన అనుభూతిని కలిగిస్తుంది.

Read Also: యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

సన్‌రూఫ్, మూన్‌రూఫ్ ఉపయోగాలు   

⦿ గాలి,  కాంతి:  ప్రయాణ సమయంలో తాజా గాలిని, వెలుతురును ప్రయాణీకులకు అందించేలా సాయపడుతాయి.

⦿ విశాలమైన అనుభూతి: సన్‌రూఫ్, మూన్‌రూఫ్ క్యాబిన్ చిన్నగా ఉన్నా, పెద్దగా కనిపించేలా విశాలమైన అనుభూతిని కలిగిస్తాయి.

⦿ లుక్: కారుకు లగ్జరీ లుక్‌ను ఇవ్వడంలో సన్‌రూఫ్, మూన్‌రూఫ్ సాయపడుతాయి.

మామూలుగా చెప్పాలంటే, ఇప్పుడు అందరూ పిలిచే సన్‌ రూఫ్‌లలో ఎక్కువ శాతం మూన్‌ రూఫ్‌ లే. ఎందుకంటే అవి గాజుతో తయారు చేయబడి, కాంతిని లోపలికి అనుమతించేలా ఉంటాయి.

Read Also: స్కార్పియో To సఫారీ.. 5-స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఇండియన్ కార్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×