E-Paper
Advertisement

RTC JAC: ఈ నెల 24న చలో సెక్రటేరియట్.. టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పిలుపు!

RTC JAC: ఈ నెల 24న చలో సెక్రటేరియట్.. టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పిలుపు!
Advertisement

RTC JAC:  ఈ నెల 24న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నామని రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ (RTC JAC)  పిలుపు నిచ్చింది. హైదరాబాద్ లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసి కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సుమారు రెండున్నరేళ్ల నుంచి ఉద్యమాల ద్వారా సీఎం, మంత్రులతో పాటు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం 

అయినప్పటికీ హామీల అమలుకు నోచుకోలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తామని, 2021 వేతన సవరణ అమలు చేస్తామని, ఆర్టీసిని విస్తరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయకుండా వాటిని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులపై ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టి పనిభారాలు మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: Collector BM Santhosh: శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ సంతోష్!

ప్రభుత్వంపై కార్మికులలో అసంతృప్తి

రోజుకు 16 గంటలు బలవంతంగా డ్యూటీలు చేయిస్తూ కార్మికుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై కార్మికులలో రోజు రోజుకూ అసంతృప్తి, వ్యతిరేకత తీవ్రరూపం దాలుస్తున్నాయని అన్నారు. సమావేశంలోజేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి , సీఎన్ కృష్ణ, జె.రాఘవులు, ఎన్.బాల్ రెడ్డి, ఎన్.బుద్ధ విశాల్, ఎం.ఎ.మజీద్, డి.రాంచందర్, పాపయ్యగౌడ్, ము త్యాలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Medchal Road Accident: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని యువకుడు మృతి!

Related News

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Big Stories

Advertisement
×