E-Paper
Advertisement

5 Star Rating Cars: స్కార్పియో To సఫారీ.. 5-స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఇండియన్ కార్లు ఇవే!

5 Star Rating Cars: స్కార్పియో To సఫారీ.. 5-స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఇండియన్ కార్లు ఇవే!
Advertisement

ప్రస్తుతం భారత్ లో తయారవుతున్న కార్లు అద్భుతమైన ఇంజనీరింగ్, బిల్డ్ క్వాలిటీతో ఆకట్టుకుంటున్నాయి. సేఫ్టీ రేటింగ్ లో సత్తా చాటుతున్నాయి. పలు ఇండియన్ మోడల్ కార్లు  గ్లోబల్ NCAP, భారత్ NCAP అత్యున్నత భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్నాయి. టాప్ మోడళ్లలో మహీంద్రా స్కార్పియో-ఎన్, టాటా సఫారీ, మారుతి సుజుకి విక్టోరిస్, టాటా హారియర్,  మారుతి సుజుకి డిజైర్ ఉన్నాయి.

⦿ మహీంద్రా స్కార్పియో-ఎన్

గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో అడల్ట్ ప్యాసింజర్స్ రక్షణలో  స్కార్పియో ఎన్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఈ SUV డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్, డిసెంట్ కంట్రోల్ లాంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ కారు మార్కెట్ లో రూ. 13.49 లక్షల (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది.

⦿ టాటా సఫారీ

Advertisement

టాటా సఫారీ గ్లోబల్ NCAP రేటింగ్ లో సత్తా చాటింది. అడల్ట్స్ తో పాటు పిల్లల సేఫ్టీలో 5 స్టార్ భద్రతా రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ SUV 6 ఎయిర్‌ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, లెవల్ 2 ADAS లాంటి కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోడల్ రూ. 13.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.

⦿ మారుతి సుజుకి విక్టోరిస్

మారుతి సుజుకి విక్టోరిస్ పెద్దలు, పిల్లల రక్షణకు సంబంధించి గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్ భద్రతా రేటింగ్‌ ను పొందింది. ఇది లెవల్ 2 ADASను కలిగి ఉన్న మొట్టమొదటి మారుతి సుజుకి మోడల్. దీని ధర రూ. 10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంది. ఈ కారు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, 6 ఎయిర్‌ బ్యాగ్‌ లను కలిగి ఉంది.

⦿ టాటా హారియర్

Advertisement

టాటా హారియర్ గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్ భద్రతా రేటింగ్‌ ను పొందింది. పెద్దలు, పిల్లలకు సంబంధించి రక్షణ విభాగాలలో అద్భుతమైన స్కోర్‌ ను కలిగి ఉంది. ఈ SUV లెవల్ 2 ADAS ఫీచర్లను కూడా అమర్చబడింది. ఈ కారు ధర రూ. 12.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Read Also: మార్కెట్ లో అట్టర్ ఫ్లాప్ అయిన మహీంద్రా కార్లు ఇవే, ఎందుకో తెలుసా?

⦿ మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి డిజైర్ అడల్డ్ ప్రయాణీకుల భద్రత పరంగా 5 స్టార్ రేటింగ్‌, చిల్డ్రన్ ప్రొటెక్షన్ లో 4 స్టార్ రేటింగ్‌ ను కలిగి ఉంది.  డిజైర్‌ లో ఆరు ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీని ధర దాదాపు రూ. 6.26 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Read Also:  టాటా లవర్స్ కు పండుగే, లాంచ్ కు ముందే పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ ఆవిష్కరణ!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×