E-Paper
Advertisement

Suzuki E Access: సుజుకి అదిరిపోయే ఆఫర్, ఎలక్ట్రిక్ యాక్సెస్ పై ఏకంగా రూ. 20,000 బెనిఫిట్స్!

Suzuki E Access:  సుజుకి అదిరిపోయే ఆఫర్, ఎలక్ట్రిక్ యాక్సెస్ పై ఏకంగా రూ. 20,000 బెనిఫిట్స్!
Advertisement

Suzuki E Access Offer:  సుజుకి.. సరికొత్త ఎలక్ట్రిక్ యాక్సెస్ స్కూటర్ మీద క్రేజీ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. E యాక్సెస్ కొనుగోలుపై రూ. 19,800 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్రయోజనాలు ఫైనాన్స్, పొడిగించిన వ్యారంటీ, ఇతర బోనస్‌ల రూపంలో అందుబాటులో ఉంచింది.

ఫైనాన్సియల్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్

కొత్త ఎలక్ట్రిక్ యాక్సెస్ కొనుగోలుదారులకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కింద రూ. 9,800 వరకు ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. ఇందుకోసం సుజుకి, ఇతర ఫైనాన్షియల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 5.99 శాతం వరకు వడ్డీ రేట్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా, E యాక్సెస్‌ను కొనుగోలు చేసే ప్రస్తుత సుజుకి కస్టమర్‌ కు రూ. 10,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. బ్రాండ్  కొత్త కస్టమర్లకు రూ. 7,000 వెల్ కమ్ బోనస్ లభిస్తుంది. యాజమాన్యాన్ని మరింత సజావుగా చేయడానికి రూ. 4,000 విలువైన ఎక్స్ టెండెడ్ వారంటీ ఉచితంగా లభిస్తుంది. ఇది ఈ-స్కూటర్‌ను ఏడు సంవత్సరాలు లేదంటే, 80,000 కి.మీ వరకు కవర్ అయ్యేలా వర్తింపజేస్తుంది.

ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ గా..

Advertisement

సుజుకి E యాక్సెస్ అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. రూ. 1.88 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. ఇది ఏథర్ 450 అపెక్స్‌ కు చాలా దగ్గరగా ఉంటుంది. స్కూటర్  స్పెసిఫికేషన్లు, ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటే ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

Read Also: సూపర్ లుక్, అంతకు మించి మైలేజ్, హీరో జూమ్ 160 అదుర్స్ అంతే!

Advertisement

ఇక E యాక్సెస్ గరిష్ట వేగం గంటకు 71 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒకే ఛార్జ్ తో ఈ స్కూటర్ 95 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. బ్యాటరీ సున్నా నుంచి 80 శాతం ఛార్జింగ్ కావడానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ఈ స్కూటర్ కు తాజాగా తీసుకొచ్చిన బెనిఫిట్స్ తో కొనుగోలుదారులకు మరింత అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ ద్వారా అమ్మకాలు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

Read Also:  అదిరిపోయే రంగుల్లో KTM 250 డ్యూక్, చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×