E-Paper
Advertisement

KTM 250 Duke: అదిరిపోయే రంగుల్లో KTM 250 డ్యూక్, చూస్తే వావ్ అనాల్సిందే!

KTM 250 Duke: అదిరిపోయే రంగుల్లో KTM 250 డ్యూక్, చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

ఇండియన్ మార్కెట్ లో KTM క్రేజీ బైక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ కంపెనీకి చెందిన 250 డ్యూక్ మార్కెట్ లో మంచి ఆదరణను కలిగి ఉంది. ఇప్పటికే ఈ బైక్ పలు రంగుల్లో అందుబాటులో ఉండగా, తాజాగా మరో రెండు రంగుల్లో లాంచ్ చేసింది. తాజాగా అప్ డేట్ లో భాగంగా KTM భారత్ లో 250 డ్యూక్ కోసం రెండు కొత్త కలర్ స్కీమ్స్ ను పరిచయం చేసింది. ఈ కొత్త రంగుల్లో ఒకటి సిల్వర్ మెటాలిక్  కగా, మరొకటి స్లేట్ గ్రే. ఇవి ఇప్పటికే ఉన్న పెయింట్ స్కీమ్‌ల శ్రేణిలో యాడ్ కానున్నాయి.

కొత్త కలర్ 250 డ్యూక్ బైక్స్ ఎలా ఉన్నాయంటే?

కొత్త సిల్వర్ మెటాలిక్ షేడ్ చాలా అందంగా కనిపిస్తుంది. ట్యాంక్ ఎక్స్‌ టెన్షన్‌ లపై సిల్వర్ ఫినిషింగ్, ఇంధన ట్యాంక్‌పై డార్క్ గ్రే ఫినిషింగ్‌ తో ఉంటుంది. మరోవైపు, స్లేట్ గ్రే షేడ్ ట్యాంక్ ప్యానెల్స్ పై డార్క్ గ్రే ట్రీట్‌మెంట్, ఇంధన ట్యాంక్‌పై ఆరెంజ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది.

మెకానికల్ గా నో ఛేంజెస్

Advertisement

ఇక 2026 KTM 250 డ్యూక్ కలర్స్ మారినప్పటికీ, మెకానికల్ గా ఎలాంటి ఛేంజెస్ లేవు. ఇది 249.7cc, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది 30.5bhp పవర్, 25Nm పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. బాడీవర్క్ కింద, బైక్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. WP అపెక్స్ అప్‌ సైడ్ డౌన్ ఫోర్క్ అప్ ఫ్రంట్, వెనుక మోనోషాక్‌పై సస్పెండ్ చేయబడింది. బ్రేకింగ్ కోసం 320 mm ముందు, 240mm వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

2026 KTM 250 డ్యూక్ ఫీచర్లు

2026 KTM 250 డ్యూక్ 6 స్పీడ్ గేర్ సిస్టమ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. ఆఫ్‌ సెట్ మోనోషాక్‌ తో స్ప్లిట్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో 5-అంగుళాల TFT కలర్ డిస్ ప్లే ఉంటుంది. దీని ద్వారా కాల్, SMS, వార్నింగ్స్, నావిగేషన్ ను చూసుకోవచ్చు. పూర్తి LED లైటింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. భద్రత విషయానికి వస్తే సూపర్ మోటో మోడ్‌ తో డ్యూయల్-ఛానల్ ABS ను కలిగి ఉంటుంది. ఇంధన సామర్థ్యం 15 లీటర్లు ఉంటుంది. ఈ బైక్ బరువు 162.8 కిలోలు ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ కు సుమారు 30 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: విడా V2 vs విడా VX2.. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే బెస్ట్?

2026 KTM 250 డ్యూక్ ధర

2026 KTM 250 డ్యూక్  కొత్త మోడల్ ధర రూ. 2.13 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఆన్ రోడ్ ధర సుమారు రూ. 2,70,236 గా ఉంది. ఇది స్లేట్ గ్రే, సిల్వర్ మెటాలిక్ లాంటి కొత్త రంగులలో లభిస్తోంది.

Read Also: కవాసకి నింజా 300పై రూ.28,000 తగ్గింపు, ఆఫర్ జస్ట్ నాలుగు రోజులు మాత్రమే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×