E-Paper
Advertisement

Electrified Road: ఎలక్ట్రిక్ రోడ్లు వచ్చేస్తున్నాయ్, దానిమీద వెళ్తే ఆటోమేటిక్ గా ఈవీలు ఛార్జింగ్ అవుతాయి!

Electrified Road: ఎలక్ట్రిక్ రోడ్లు వచ్చేస్తున్నాయ్, దానిమీద వెళ్తే ఆటోమేటిక్ గా ఈవీలు ఛార్జింగ్ అవుతాయి!
Advertisement

Sweden Electrified Road: ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. పెట్రో వాహనాలను వదిలేసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే, పెట్రోల్ బంకులు మాదిరిగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఆయా దేశాలు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. భారత్ లో కూడా శరవేగంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు అవుతున్నాయి. అయితే, స్వీడన్ మరో అడుగు ముందుకు వేసింది. ఏకంగా ఎలక్ట్రిక్ రోడ్లను నిర్మిస్తోంది. ఇంతకీ వీటి ప్రత్యేకతలు ఏంటంటే..

ఎలక్ట్రిక్ రోడ్లు ఎలా పని చేస్తాయంటే.?  

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్‌ శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్‌ వాహనాల్ని నడుపుతూనూ చార్జింగ్‌ చేసుకునే  ఎలక్ట్రిక్‌ రోడ్లను నిర్మిస్తున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ రోడ్డు స్వీడన్‌ రాజధాని స్టాక్‌ హోంలో నిర్మించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలు చార్జింగ్‌ కోసం పదే పదే ఆగాల్సిన అవసరం లేకుండా సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది. కండక్టీవ్‌ రెయిల్స్‌, ఇండక్టీవ్‌ కాయిల్స్‌ ని ఉపయోగించి 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నది. రోడ్డు మధ్యలో ఏర్పాటుచేసిన భాగం నుంచి సురక్షిత, సమర్థవంతమైన పవర్ ను ఎలక్ట్రిక్ వాహనాలకు అందిస్తుంది. వైర్‌ లెస్‌ పద్ధతిలోనూ చార్జింగ్‌ చేయగలిగే  ఇండక్టివ్‌ చార్జింగ్‌ ను సైతం ఎలక్ట్రిక్‌ రోడ్లు కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్‌ రోడ్ల నిర్మాణంపై అమెరికా సహా పలు దేశాల్లో ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయి.

2035 నాటికి 3000 కిలో మీటర్ల ఎలక్ట్రిక్ రోడ్ల నిర్మాణం

Advertisement

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకోవడానికి వీలు కల్పించే ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత విద్యుదీకరణ రహదారిని స్వీడన్ నిర్మిస్తోంది. 2035 నాటికి 3,000 కిలోమీటర్లు నిర్మించాలని స్వీడన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది స్థిరమైన రవాణాకు ఎంతగానో ఉపయోగపడనుంది. E20 మోటార్‌ వేలో హాల్స్‌ బర్గ్, ఓరెబ్రో మధ్య  వాహనాలు వెళ్తూనే ఛార్జ్ చేసుకునేలా ఈ మార్గాన్ని సిద్ధం చేశారు. ఆ దేశంలో 2045 నాటికి కాలుష్య రహిత ప్రయాణాలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకును స్వీడన్ చేపట్టింది.

స్వీడన్ ఎలక్ట్రిక్ రోడ్లు విశేషాలు   

⦿ ఈ రోడ్లు కండక్టివ్ సిస్టమ్స్ లేదంటే, డైనమిక్ వైర్‌ లెస్ పవర్ ట్రాన్స్‌ ఫర్ టెక్నాలజీని ఉపయోగించి, నడుస్తున్న వాహనాలకు విద్యుత్ అందిస్తాయి.

Advertisement

⦿ ట్రక్కులు, బస్సులు, కార్లు ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా ప్రయాణంలోనే ఛార్జ్ చేసుకోవడం ద్వారా  రేంజ్ యాంగ్జైటీని  తగ్గించనుంది.

⦿ E20 రహదారి  స్టాక్‌ హోమ్, గోథెన్‌ బర్గ్, మాల్మో నగరాలను కలుపుతూ ముందకు సాగుతోంది.

⦿ 2030 నాటికి సుమారు 2,000 కిలోమీటర్ల విద్యుదీకరించబడిన రోడ్లను అభివృద్ధి చేయాలని స్వీడన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

⦿ ఇంధన రహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, సరుకు రవాణాలో సమర్థతను పెంచాలని భావిస్తోంది.

Read Also:ఒకే ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణం, అదిరిపోయే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×