E-Paper
Advertisement

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!
Advertisement

Tata Curvv Series X Launched: టాటా మోటార్స్ కర్వ్ సిరీస్‌ లో కొత్త సిరీస్ Xను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త లైనప్ ధరలు రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉన్నాయి. కొత్త సిరీస్‌ లో ముఖ్యంగా బేసిక్, మిడ్ వేరియంట్లలో ఫీచర్లను పెంచారు. ఇంతకుముందు టాప్ వేరియంట్లలో మాత్రమే లభించిన కొన్ని ఫీచర్లను ఇప్పుడు ఈ వేరియంట్లకు కూడా అందించారు. అలాగే డార్క్ ఎడిషన్‌ ను మరిన్ని వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

రూ.10 లక్షల ప్రారంభ ధరతో..

కర్వ్ సిరీస్ Xలో స్మార్ట్ X బేస్ వేరియంట్. దీని ధర రూ.10 లక్షలు. ఆ తర్వాత ప్యూర్ X ధర రూ.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్యూర్ X+ ధర రూ.11.80 లక్షల నుంచి ఉండగా, డార్క్ ఎడిషన్ రూ.12 లక్షల నుంచి లభిస్తుంది. క్రియేటివ్ X+ ధర రూ.12.91 లక్షల నుంచి, దాని డార్క్ ఎడిషన్ రూ.13.16 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అకంప్లిష్డ్ X ధర రూ.14 లక్షల నుంచి ఉండగా, అకంప్లిష్డ్ X+ టాప్ వేరియంట్ ధర రూ.18.50 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ల మధ్య ధర వ్యత్యాసాన్ని కూడా తగ్గించారు. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ కోసం చెల్లించే అదనపు మొత్తాన్ని కూడా తగ్గించారు.

బేసిక్ వేరియంట్లలోనూ మంచి ఫీచర్లు

Advertisement

కొత్త కర్వ్ సిరీస్ Xలో ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్యూర్ X నుంచే 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ లభిస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, ఆటో ఫోల్డింగ్ ORVMలు లాంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్‌లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ముందు, వెనుక USB పోర్టులు అందుబాటులో ఉంటాయి.

ఎక్కవ సౌకర్యం, మరింత భద్రత

క్యాబిన్‌లో లెదరెట్ సీట్లు, వెనుక AC వెంట్లు, రియర్ ఆర్మ్‌ రెస్ట్, రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. వెనుక ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభించేలా సీట్ల డిజైన్‌ లో కూడా మార్పులు చేశారు. పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌ బ్యాగులు, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, ABS, EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు అందించారు. టాప్ వేరియంట్లలో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 9-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్, ట్విన్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. లెవల్-2 ADAS, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, గెస్చర్ కంట్రోల్ టెయిల్‌గేట్ కూడా లభిస్తాయి.

మూడు ఇంజిన్ ఆప్షన్లు

Advertisement

పవర్‌ట్రెయిన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120hp, 170Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 125hp, 225Nm అందిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 118hp, 260Nm టార్క్‌ ను ఇస్తుంది. టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లకు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCA ఆప్షన్లు ఉన్నాయి. డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ మాత్రం టాప్ అకంప్లిష్డ్ X+ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. బేసిక్ వేరియంట్లలోనే ఎక్కువ ఫీచర్లు అందించడం, డార్క్ ఎడిషన్‌ను విస్తరించడం ద్వారా కర్వ్ సిరీస్ Xతో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించాలని టాటా మోటార్స్ భావిస్తోంది.

Tags

Related News

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

Big Stories

Advertisement
×