E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో 10 రోజులు వాడేయొచ్చు.. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేని కొత్త Luna Band సేల్స్ స్టార్ట్!

సింగిల్ ఛార్జ్‌తో 10 రోజులు వాడేయొచ్చు.. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేని కొత్త Luna Band సేల్స్ స్టార్ట్!
Advertisement

Luna Band: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఫిట్‌నెస్ ట్రాకర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే రకరకాల బ్రాండ్లు మార్కెట్లో ఉన్నప్పటికీ.. సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ డివైజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐఎఫ్ఏ 2026 వేదికగా ‘లూనా బ్యాండ్’ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది మొదట్లో సీఈఎస్‌‌లో పరిచయమైన ఈ డివైజ్.. జులైలో ప్రీ-ఆర్డర్లు మొదలుపెట్టి ఇప్పుడు నేరుగా కస్టమర్ల చేతుల్లోకి వెళ్తోంది. డిస్‌ప్లే లేకపోవడమే దీని ప్రత్యేకత.

ధర, రంగుల వివరాలు:

భారత్‌లో ఈ లూనా బ్యాండ్ ధరను కంపెనీ రూ.13,999గా నిర్ణయించింది. అమెరికాలో దీని ధర 149 డాలర్లుగా ఉంది. ఇది అలో గ్రీన్, డెసర్ట్ బీజ్, అండ్ ఆనిక్స్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. ఒకవేళ మీకు వేరే లుక్ కావాలనుకుంటే ఎంబర్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ, గ్లేసియర్ బ్లూ కలర్ స్ట్రాప్స్‌ను విడిగా కొనుక్కోవచ్చు.

Advertisement

Also Read: పాత యాపిల్ వాచ్ ఇప్పుడు కొనొచ్చా? డబ్బులు పెట్టే ముందు ఈ 4 విషయాలు తెలుసుకోండి!

ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఉండదు:

ఈ బ్యాండ్‌లో అత్యంత ఆకట్టుకునే విషయం ఏంటంటే.. దీనికి ఎలాంటి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. సాధారణంగా ఊప్, ఫిట్‌బిట్ ఎయిర్ లాంటి పాపులర్ బ్రాండ్లలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు వాడాలంటే కచ్చితంగా డబ్బులు కట్టాలి. కానీ లూనా బ్యాండ్‌ను ఒక్కసారి కొంటే చాలు, సబ్‌స్క్రిప్షన్ లేకుండానే అన్ని ఫీచర్లను వాడుకోవచ్చు. దీనిని చేతి మణికట్టుకే కాకుండా భుజంపై కూడా ధరించవచ్చు.

పర్సనల్ హెల్త్ కోచ్‌:

Advertisement

ఇది కేవలం డేటాను చూపించడమే కాకుండా.. మన శరీర స్థితికి తగ్గట్లు సలహాలు ఇచ్చే పర్సనల్ ఏఐ హెల్త్ కోచ్‌లా పనిచేస్తుంది. లైఫ్‌ఓఎస్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేసే ఈ డివైజ్.. ఆహార అలవాట్లు, మహిళల రుతుక్రమం ఆధారంగా సూచనలు ఇస్తుంది. మన శరీరానికి ఎంత నీరు కావాలి, ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోవాలనేది కూడా చెప్తుంది.

హెల్త్ ట్రాకింగ్, బ్యాటరీ లైఫ్:

ఇందులో మల్టీ ఛానల్ హృదయ స్పందన సెన్సార్, బాడీ టెంపరేచర్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి హార్ట్ బీట్, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, నిద్ర విధానాలను పక్కాగా ట్రాక్ చేస్తాయి. రన్నింగ్, బాక్సింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలను ఆటోమేటిక్‌గా రికార్డ్ చేస్తుంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లకు సపోర్ట్ చేసే ఈ బ్యాండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుంది.

Also Read: మెకానికల్ కీబోర్డ్ కొనేముందు ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే తిప్పలు తప్పవు!

Tags

Related News

ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సేవ్ చేయడానికి పాటించాల్సిన 5 రూల్స్!

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

Big Stories

Advertisement
×