E-Paper
Advertisement

Tata Discounts: టాటా అదిరిపోయే డిస్కౌంట్స్.. ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా 3.8 లక్షల తగ్గింపు!

Tata Discounts: టాటా అదిరిపోయే డిస్కౌంట్స్.. ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా 3.8 లక్షల తగ్గింపు!

Tata EV Discounts March 2026: టాటా మోటార్స్ మార్చి 2026 డిస్కౌంట్స్ కు సంబంధించి అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ఈవీ పోర్ట్‌ ఫోలియోకు సంబంధించి భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.  కొత్త, పాత అనే తేడా లేకుండా పలు ఎలక్ట్రిక్ కార్లపై ఈ డిస్కౌంట్స్ అందిస్తుంది. గరిష్టంగా రూ. 3.80 లక్షల వరకు తగ్గింపు ఇస్తుంది. ఈ డిస్కౌంట్ ప్యాకేజీలో డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, ఎంపిక చేసిన వాహనాలపై నిర్దిష్ట గ్రీన్ బోనస్‌ తో సహా పలు తగ్గింపులు ఉంటాయి. ఇప్పటికే ఉన్న టాటా పెట్రో కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి అప్‌ గ్రేడ్ అయ్యే కొనుగోలుదారులు అదనపు లాయల్టీ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.

⦿ కర్వ్ EV: రూ. 3.80 లక్షల వరకు

కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన కర్వ్ ఎలక్ట్రిక్ కూపే SUV ప్రస్తుతం మొత్తం లైనప్‌ లో అత్యధిక డిస్కౌంట్‌ ను పొందుతుంది. నిర్దిష్ట వేరియంట్‌ ను బట్టి  రూ. 3.80 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. తాజా మోడల్ ఎంట్రీ లెవల్ క్రియేటివ్ 45 ట్రిమ్ రూ. 2,80,000 వరకు ప్రయోజనాలతో వస్తుంది. 2026 కర్వ్ EV టాప్ వేరియంట్లు షోరూమ్ ధర కంటే రూ. 3,30,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.

⦿ పంచ్ EV: రూ.2.20 లక్షల వరకు 

పంచ్ EV ప్రారంభించినప్పటి నుంచి మంచి అమ్మకాలు కొనసాగిస్తుంది. 2024, 2025 తయారీ యూనిట్లకు సంబంధించి  బేస్ స్మార్ట్ ట్రిమ్‌ పై రూ. 1,60,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర స్టాండర్డ్ రేంజ్ వేరియంట్లపై రూ.1,90,000 వరకు తగ్గింపులు లభిస్తుంది. అత్యంత డిమాండ్ ఉన్న లాంగ్ రేంజ్ వెర్షన్లపై రూ.2,20,000 గరిష్ట తగ్గింపు లభిస్తుంది. కొత్త 2026 మోడళ్లలో బేస్ స్మార్ట్ ట్రిమ్ రూ.90,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అన్ని ఇతర స్టాండర్డ్ వేరియంట్లపై రూ.1,20,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 2026 లాంగ్ రేంజ్ ట్రిమ్‌లపై రూ.1,40,000 గరిష్ట ఆఫర్లు లభిస్తాయి.

⦿ టియాగో EV, నెక్సాన్ EV ఆఫర్లు

ఎంట్రీ లెవల్ టియాగో EV హ్యాచ్‌ బ్యాక్ 2024, 2025 స్టాక్ కు సంబంధించి XT ట్రిమ్ ధర రూ.1,80,000 వరకు తగ్గుతుంది.  అధిక XZ ప్లస్ వేరియంట్లపై రూ.2,10,000 తగ్గింపు లభిస్తుంది. 2026 మోడళ్లపై XT ట్రిమ్ పై రూ. 90,000 వరకు తగ్గింపు లభిస్తుంది. XZ ప్లస్ వెర్షన్లు రూ. 1,20,000 తగ్గింపు లభిస్తుంది.  ఇదే సమయంలో, Nexon EV 2024, 2025 మోడళ్లను కొనుగోలు చేసే వాళ్లు మొత్తం వేరియంట్ శ్రేణిలో రూ. 1,20,000 గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. 2026 మోడల్ కు మొత్తం డిస్కౌంట్ రూ. 50,000 లభిస్తుంది.

Read Also: లగ్జరీ కార్లు కొనాలనుకునేవారికి షాక్.. బెంజ్, ఆడి ధరలు భారీగా పెంపు!

⦿ హారియర్ EV: రూ. 1.5 లక్షల వరకు 

ఫ్లాగ్‌ షిప్ హారియర్ EV కూడా మార్చిలో భారీ డిస్కౌంట్ పొందుతుంది. 2024, 2025,  బ్రాండ్ న్యూ 2026 మోడల్స్ పై రూ. 1,50,000 వరకు తగ్గింపు అందిస్తుంది. హారియర్ EV పథకంలో గ్రీన్ బోనస్ కూడా ఉంది.

Read Also: సియెర్రా To అవిన్యా.. ఈ ఏడాది టాటా విడుదల చేసే క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×