E-Paper
Advertisement

Luxury Car Price Hike: లగ్జరీ కార్లు కొనాలనుకునేవారికి షాక్.. బెంజ్, ఆడి ధరలు భారీగా పెంపు!

Luxury Car Price Hike: లగ్జరీ కార్లు కొనాలనుకునేవారికి షాక్..  బెంజ్, ఆడి ధరలు భారీగా పెంపు!
Advertisement

 Benz-Audi Car Price Hike: లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు తమ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. తమ కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 2026 నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు కీలక ప్రకటన చేశాయి. ఇంతకీ ధరలు ఎంత శాతం పెరగబోతున్నాయి? ఏ మోడల్స్ ధరల పెంపుతో ఎఫెక్ట్ అవుతున్నాయి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెంపు

భారత్ లో అమ్మే తమ వాహనాల ధరలను మెర్సిడెస్ బెంజ్ 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2026 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపింది. జనవరి 2026 తర్వాత మరోసారి ధరలు పెంచుతూ జర్మన్ ఆటోమేకర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్ల ధరల పెరుగుదలకు ఫారెక్స్‌ లో అస్థిరత, వాహనాల తయారీలో పెరుగుతున్న ఇన్‌ పుట్ ఖర్చులు కారణమని తెలిపింది.

Advertisement

ఇక ఏప్రిల్ నుంచి ఆయా కార్ల మోడల్స్ ను బట్టి రూ. 89,000 నుంచి రూ. 4.84 లక్షల వరకు పెరుగుతాయని వెల్లడించింది. భారత్ లో మెర్సిడెస్ బెంజ్ A క్లాస్ సెడాన్ ధర రూ. 44.45 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.  అయితే, అత్యంత ఖరీదైన మోడల్ AMG G63 (G-క్లాస్) ధర రూ. 3.67 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. అటు C-క్లాస్, EQS, E-క్లాస్ LWB, S-క్లాస్, EQA, EQB, EQS, EQE, GLC, GLA, GLE, GLS, CLE కాబ్రియోలెట్, కొత్తగా ప్రారంభించబడిన V-క్లాస్ లాంటి  మోడళ్ల ధరలు కూడా ప్రభావితం కానున్నాయి.

Read Also:హోండా షాకింగ్ డెసిషన్, ఆ రెండు కీలక మోడల్స్ కు బ్రేక్!

ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన ఆడి

Advertisement

అటు మరో జర్మన్ ఆటో మొబైల్ తయారీ సంస్థ ఆడి కూడా ధరల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ 2026 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇన్‌ పుట్ ఖర్చులు పెరగడం, కరెన్సీ రేట్లలో హెచ్చుతగ్గుల కారణంగా ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. 2 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. భారత్ లో అమ్మే అన్ని మోడల్స్ కు ఈ ధర వర్తిస్తుందని ప్రకటించింది. కానీ, మోడల్ ఎంపికను బట్టి మారుతుంది. “ఇటీవల పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా, మేము ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నాయి. మా కస్టమర్లపై ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం” అని ఈ ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు.

ఆడి ఇండియా ఇటీవలే కొత్త SQ8 బుకింగ్స్ ప్రారంభించింది. వచ్చే వారం దాని లాంచ్‌ కానుంది. ఈ మోడల్ 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో 500bhp పవర్, 770Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్రాండ్ నుంచి నెక్ట్స్ కొత్త Q3 లాంచ్ కావచ్చని భావిస్తున్నారు.

Read Also: ప్రపంచంలోనే పవర్‌ ఫుల్ క్రూయిజర్ బైక్, దీని ఇంజిన్ పవర్ ఎంతో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×