E-Paper
Advertisement

Tata 2026 EV Plan: సియెర్రా To అవిన్యా.. ఈ ఏడాది టాటా విడుదల చేసే క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Tata 2026 EV Plan: సియెర్రా To అవిన్యా.. ఈ ఏడాది టాటా విడుదల చేసే క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Tata Motors EV Expansion: టాటా మోటార్స్ భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో సత్తా చాటుతోంది. టియాగో EV, టిగోర్ EV, పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EV, హారియర్ EV లాంటి ఆరు మోడళ్లతో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లలో దుమ్మురేపుతోంది. అంతేకాదు, తన ఈవీ ఫోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు, 2026 చివరి నాటికి కనీసం 3 కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి విడుదల చేయాలని భావిస్తోంది.

⦿ టాటా సియెర్రా EV

టాటా సియెర్రా పూర్తి ఎలక్ట్రిక్ ఏప్రిల్-జూన్ 2026లో భారత మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఈ కారు టాటా ఈవీ పోర్ట్‌ ఫోలియోలో కర్వ్ EV, హారియర్ EV మధ్య ఉంటుంది. ఇది సింగిల్ మోటార్ రియర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.  సియెర్రా EV పలు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో రానుంది. ఇది హారియర్ EVతో అనేక భాగాలను పంచుకుంటుంది. ఆల్ ఎలక్ట్రిక్ SUVని వెహికల్ టు వెహికల్, వెహికల్ టు లోడ్  ఛార్జింగ్ ఫీచర్లతో విడుదల చేయవచ్చు. ఇది 55 kWh, 65 kWh బ్యాటరీలతో రావచ్చు. పూర్తి ఛార్జ్‌ పై ఈ కారు 500 కి.మీ పరిధిని అందిస్తుందని భావిస్తున్నారు.

⦿ 2026 టాటా టియాగో EV ఫేస్‌లిఫ్ట్

Advertisement

టియాగో EV ఫేస్‌ లిఫ్ట్ దీపావళి పండుగ సీజన్‌కు ముందు అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. టాటా అతి చిన్న, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు ఫేస్‌ లిఫ్టెడ్ మోడల్ రోడ్ టెస్టింగ్ ప్రారంభమైంది. ఈ కొత్త వెర్షన్ ఆల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్‌ లో రీ  డిజైన్ చేయబడిన హెడ్‌ ల్యాంప్ సెటప్, ట్వీక్ చేయబడిన బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయని భావిస్తున్నారు. ఇంటీరియర్ అప్‌డేట్స్ సహా పలు మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే, 2026 టాటా టియాగో EV ఫేస్‌ లిఫ్ట్‌ ను పెద్ద బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది 19.2 kWh, 24 kWh బ్యాటరీలతో అందుబాటులో ఉంది.  ఇవి వరుసగా 223 కి.మీ, 293 కి.మీ పరిధిని అందిస్తాయి.

⦿ టాటా అవిన్యా EV

టాటా మోటార్స్ ఇటీవల అవిన్యా EV 2026 చివరి నాటికి భారత మార్కెట్లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. టాటా అవిన్యా కాన్సెప్ట్ 2023 ఆటో ఎక్స్‌ పోలో లాంచ్ చేశారు. అయితే, అవిన్యా X అనే ప్రీ ప్రొడక్షన్ వెర్షన్ గత సంవత్సరం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పోలో ప్రదర్శించబడింది. టాటా Gen 3 EV ఆర్కిటెక్చర్ ఆధారంగా ఈ SUV రూపొందింది. స్పోర్ట్‌ బ్యాక్ బాడీ స్టైలో రూపొందింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా, పలు బ్యాటరీ కాన్ఫిగరేషన్లతో వస్తుంది. టాటా అవిన్యా EV ప్రీమియం మోడల్, ఇది హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6 లకు పోటీ ఇవ్వనుంది. దీని ధరలు దాదాపు రూ. 35 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఒకే ఛార్జ్‌ తో 600 కి.మీకి పైగా రేంజ్ అందిస్తుంది.

Advertisement

Read Also: మహీంద్రా రేసింగ్ కారు కొన్న హీరో అజిత్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×