E-Paper
Advertisement

Mega EV Charging Hubs: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, ఈవీల్లో ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ అవసరం లేదు!

Mega EV Charging Hubs: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, ఈవీల్లో ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ అవసరం లేదు!
Advertisement

దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరుగుతోంది. చాలా మంది పెట్రో కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లోకి అడుగు పెట్టాయి. ఈ ఏడాది కూడా క్రేజీ కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీలకు ఛార్జింగ్ అవకాశాలను మెరుగు పరిచేందుకు ప్రధాన పట్టణ కేంద్రాలు, హైవేలలో హై స్పీడ్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించబోతోంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల కోసం ప్రీమియం, హై కెపాసిటీ ఎలక్ట్రిక్ కేంద్రాల ద్వారా పబ్లిక్ ఛార్జింగ్ యాక్సెస్‌ ను బలోపేతం చేయబోతోంది.

దేశ వ్యాప్తంగా 21 మెగా ఛార్జింగ్ హబ్స్ ఏర్పాటు

బెంగళూరు, చెన్నై, మైసూరు, పూణే, వడోదర సహా పలు ప్రాంతాల్లో 21 కొత్త మెగా ఛార్జింగ్ హబ్‌లను ప్రారంభించడానికి TATA.ev,  షెల్ ఇండియా మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. EV వినియోగదారులకు వేగవంతమైన, మరింత నమ్మదగిన ఛార్జింగ్‌ ను అందించనుంది. ఈ హబ్‌లు 120 kW ఫాస్ట్ ఛార్జర్స్, మల్టీఫుల్ ఛార్జింగ్ బేలు అందుబాటులో ఉంటాయి.

ఫుడ్ నుంచి కూల్ డ్రింక్స్ వరకు.. అన్ని సౌకర్యాలు ఒకే చోట!

Advertisement

ఈ ఛార్జింగ్ హబ్‌లు ప్రధాన హైవే కారిడార్లు, పట్టణ హాట్‌ స్పాట్ ల వెంట ఉంటాయి. ఇవి ఇంట్రా సిటీ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ ఇంటర్‌ సిటీ మొబిలిటీకి సపోర్టు చేస్తాయి. ప్రతి సైట్‌ లో ఆన్ గ్రౌండ్ సపోర్ట్ స్టాఫ్, షెల్ సెలెక్ట్, ఫుడ్, డ్రింక్స్ కోసం డెలి2గో అవుట్‌ లెట్లకు యాక్సెస్, శుభ్రమైన రెస్ట్‌ రూమ్ సౌకర్యాలు ఉంటాయి. టాటా EV యజమానులు క్యూరేటెడ్ ఇన్ స్టోర్ ఆఫర్లు, ఛార్జింగ్ టారిఫ్ ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా130 ఛారింగ్ పాయింట్స్ ఏర్పాటు

TATA.ev మెగా ఛార్జింగ్ హబ్ నెట్‌ వర్క్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా 130 ఈవీ పాయింట్స్ ఏర్పాటు చేసింది. ఈ విస్తరణ TATA.ev ‘ఓపెన్ కోలాబరేషన్ 2.0’ ఫ్రేమ్‌ వర్క్‌ లో భాగం, దేశ వ్యాప్తంగా హై స్పీడ్ ఛార్జింగ్ కారిడార్లను అభివృద్ధి చేయడానికి ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తోంది. 2027 నాటికి 500 మెగా ఛార్జింగ్ హబ్‌ లతో సహా 400,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది.

కీలక నగరాల్లో పబ్లిక్ ఛార్జింగ్ సౌకర్యాలు

Advertisement

కొత్తగా ప్రారంభించబడిన మెగా ఛార్జింగ్ హబ్స్ బెంగళూరు, చెన్నైలోని ప్రధాన మొబిలిటీ కారిడార్లు, కర్ణాటక, తమిళనాడులోని ఇంటర్‌ సిటీ మార్గాలు, పూణేలోని పట్టణ, కమ్యూటర్ మార్గాలు, అహ్మదాబాద్-ముంబై హైవేతో సహా కీలక ప్రాంతాలలో ఛార్జింగ్ కవరేజీని బలోపేతం చేస్తాయి. ఇప్పటికే  ప్రధాన పట్టణ కేంద్రాలు, హైవే కారిడార్లలో  10 మెగా చార్జింగ్ పాయింట్లను ప్రారంభించింది. ఈ స్టేషన్లలో కనీసం 120 kW పవర్ ను అందించే ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నాయి. ఇవి ముఖ్యమైన ప్రయాణ మార్గాల్లో EV వినియోగదారులకు వేగంగాఛార్జింగ్‌ను అందించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చాయి. iRA.ev యాప్ ద్వారా ఛార్జింగ్ పాయింట్స్ ను గుర్తించే అవకాశం ఉంటుంది.

Read Also: బెంజ్ CLA ఎలక్ట్రిక్ కారు రివీల్, 5 క్రేజీ విషయాలు మీ కోసం!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×